Telangana Govt : నిరుద్యోగులకు శుభవార్త.. భారీగా ఉద్యోగాల భర్తీకి కసరత్తు షురూ.. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు ఇవే..

Telangana Govt : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హోంశాఖలోని వివిధ విభాగాల్లో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టింది.

Telangana Govt

  • తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
  • హోంశాఖలో ఉద్యోగాల జాతర
  • 7,437 పోస్టుల భర్తీ ప్రక్రియకు కసరత్తు ప్రారంభం

Telangana Govt : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హోంశాఖలోని వివిధ విభాగాల్లో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టింది. మొత్తం 7,437 పోస్టుల భర్తీ ప్రక్రియకు కసరత్తు ప్రారంభమైనట్లు తెలుస్తుండగా.. ఈ ఖాళీలకు సంబంధించి ప్రభుత్వం జీవోలు విడుదల చేయడంతోపాటు.. పోస్టుల భర్తీ ప్రక్రియకు సన్నాహాలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ)ని ఆదేశించింది.

Also Read : Telangana Govt : తెలంగాణ రైతులకు బిగ్ అలర్ట్.. ఈ ఏడాది బోనస్ ఇచ్చేది వీళ్లకే.. గడువులోపు నమోదు చేసుకోవాలి..

రాష్ట్రంలో పోలీసు శాఖతోపాటు అగ్నిమాపక, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. త్వరలో నోటిఫికేషన్ విడుదలకానుంది. ఈ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇవ్వగా.. స్థానిక కేడర్ వారీగా పోస్టుల పంపిణీ, రోస్టర్ పాయింట్లు తదితర వివరాలను హోంశాఖతో పాటు సంబంధిత విభాగాల నుంచి సేకరిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు టీఎస్ఎల్బీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వివరాల సేకరణ పూర్తికాగానే నియామక నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. భర్తీ చేయనున్న పోస్టుల వివరాలను విభాగాల వారీగా వెల్లడించారు.

పోలీస్ శాఖలో పోస్టులు..
సబ్ ఇన్ స్పెక్టర్ (సివిల్) – 148,
రిజర్వ్ ఎస్ఐ (ఏఆర్) – 14,
రిజర్వ్ ఎస్ఐ (టీజీఎస్పీ) – 12
రిజర్వ్ ఎస్ఐ (ఎస్ఏఆర్‌సీపీఎల్) – 3
అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఫింగర్ ఫ్రింట్ బ్యూరో) – 23
పోలీస్ కానిస్టేబుల్ (సివిల్) – 3,697
కానిస్టేబుల్ (ఏఆర్) – 1,052
కానిస్టేబుల్ (ఎస్ఏఆర్‌సీపీఎల్) -24
కానిస్టేబుల్ (డ్రైవర్) – 20
కానిస్టేబుల్ (మెకానిక్) -7
అగ్నిమాపక శాఖలో పోస్టులు..
స్టేషన్ ఫైర్ ఆఫీసర్ – 39
ఫైర్ ఫైటర్ – 751
జైళ్ల శాఖలో..
డిప్యూటీ జైలర్ (పురుషులు) – 14
డిప్యూటీ జైలర్ (మహిళలు) – 01
వార్డర్ (పురుషులు) – 196
వార్డర్ (మహిళలు) -12
షల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ..
సబ్ ఇన్‌స్పెక్టర్ – 44
కానిస్టేబుల్ – 1,380