అమల్లోకి తెలంగాణ ఎస్సీ వర్గీకరణ.. గెజిట్ విడుదల చేసిన ప్రభుత్వం.. ఏ గ్రూపులో ఏయే కులాలు ఉన్నాయి..? రిజర్వేషన్ ఏంతంటే..

రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.

Telangana SC Act

SC classification: అంబేద్కర్ జయంతి రోజున తెలంగాణలో ఎస్సీ ఉపకులాల దశాబ్దాల కల నెరవేరింది. ఎస్సీల వర్గీకరణ జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రానుంది. ఈనెల 8న ఇందుకు సంబంధించిన బిల్లును గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆమోదించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తాజా జీవోతో ఎస్సీలకు ఇప్పటి వరకు గంపగుత్తగా అమలైన రిజర్వేషన్లు ఇక నుంచి వర్గీకరణ ప్రకారం అందనున్నాయి.

Also Read: Telangana Bhu Bharati : తెలంగాణలో ఇక భూభారతి ..కొత్త చట్టం ప్రత్యేకత ఏంటి?

ప్రభుత్వం మొత్తం 56 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా విభజించింది. గ్రూప్‌ -ఏలో 15 ఉప కులాలు ఉండగా వారికి 1 శాతం రిజర్వేషన్లు, గ్రూప్‌ -బీ లో ఉన్న 18 కులాలకు 9శాతం, గ్రూప్‌ -సీలో ఉన్న 26 కులాలకు 5శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. ఇకపై గ్రూపులు, కులాల ప్రాధాన్యత క్రమంలో ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీచేయనున్నారు. ఈ గెజిట్‌ తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌ భాషల్లో అందుబాటులో ఉందని వెల్లడించింది.