Telangana Cabinet : రేపే పీఆర్సీ ప్రకటన

తెలంగాణ ఉద్యోగుల పీఆర్సీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుంది. పీఆర్సీ విషయంలో 2021, జూన్ 08వ తేదీ మంగళవారం అధికారిక ప్రకటన, ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది. జూన్ 08వ తేదీ మంగళవారం తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో పీఆర్సీ అంశంపై చర్చ జరుగనుంది.

Telangana PRC : తెలంగాణ ఉద్యోగుల పీఆర్సీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుంది. పీఆర్సీ విషయంలో 2021, జూన్ 08వ తేదీ మంగళవారం అధికారిక ప్రకటన, ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది. జూన్ 08వ తేదీ మంగళవారం తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో పీఆర్సీ అంశంపై చర్చ జరుగనుంది. ఇప్పటికే వేతన సవరణ పూర్తి నివేదికను ఆర్థిక శాఖ సమర్పించింది. దీంతో ఉద్యోగుల వేతన సవరణ నివేదికను కేబినెట్ ఆమోదించనుంది. ఉద్యోగుల ఫిట్ మెంట్, ఇతర అంశాలపై సర్కార్ ఉత్తర్వులు విడుదల చేయనుంది.

కరోనా కష్టకాలంలో 30 శాతం ఫిట్ మెంట్ ప్రకటించి..సీఎం కేసీఆర్ ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందం నింపారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులతో 2018 మే 18న ప్రభుత్వం పీఆర్సీ కమిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. 31 నెలలపాటు అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించింది ఈ కమిటీ. అనంతరం 278 పేజీల నివేదికను 2020 డిసెంబర్‌ 31న ప్రభుత్వానికి కమిషన్‌ అందజేసింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమైన విషయం తెలిసిందే. ఉద్యోగుల వయోపరిమితి పెంపు అంశంపై సీఎం హామీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి. మరి తెలంగాణ కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది.

Read More : AP Junior Doctors : ఏపీలో మోగనున్న జూ. డాక్టర్ల సమ్మె

ట్రెండింగ్ వార్తలు