Junior Doctors : చర్చలు విఫలం.. జూనియర్ డాక్టర్ల సమ్మె ఉధృతం

తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. సమ్మె విరమణపై డీఎంఈ రమేష్ రెడ్డితో జూడాల ప్రతినిధులు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. ప్రభుత్వం నుంచి సరైన హామీ రాలేదని జూడాలు తెలిపారు. లిఖితపూర్వక హామీ వస్తేనే విధుల్లో చేరతామన్నారు.

Junior Doctors

Junior Doctors : తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. సమ్మె విరమణపై డీఎంఈ రమేష్ రెడ్డితో జూడాల ప్రతినిధులు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. ప్రభుత్వం నుంచి సరైన హామీ రాలేదని జూడాలు తెలిపారు. లిఖితపూర్వక హామీ వస్తేనే విధుల్లో చేరతామన్నారు. కరోనాతో హెల్త్ కేర్ వర్కర్లు చనిపోతే ఒక్కరూపాయి కూడా ఇచ్చేది లేదని డీఎంఈ తేల్చి చెప్పారని, అలాగే పది శాతం ఇన్సెంటివ్ ప్రస్తావన కూడా లేదని అన్నారని జూడాల ప్రతినిధులు అన్నారు. 15శాతం ఇంక్రిమెంట్లపైన లిఖితపూర్వక హామీ ఇవ్వలేదన్నారు. కరోనా వస్తే నిమ్స్ లో బెడ్లు ఇవ్వనన్నారని తెలిపారు. ప్రభుత్వం నుంచి సరైన హామీ రానందున ప్రస్తుతానికి సమ్మె కొనసాగిస్తున్నట్టు జూడాలు చెప్పారు.

సీఎం స్థాయిలో చర్చలు జరిపి తమ సమస్యలు పరిష్కరించాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. లేదా ఎవరైనా మంత్రి హామీ ఇచ్చినా సమ్మె విరమణపై ఆలోచన చేస్తామన్నారు. తమ సమస్యలు పరిష్కరిస్తామంటే వెంటనే డ్యూటీలో చేరతామన్నారు.