Jagir Lands: మణికొండ దర్గాపై సుప్రీం కేసు గెలిచిన గవర్నమెంట్

సుప్రీం కోర్టులో హైదరాబాద్ జాగీర్ భూముల కేసులో తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగానే తీర్పు వచ్చింది. సంవత్సరాల తరబడి వక్ఫ్ బోర్డుకు ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న కేసు విచారణ ఎట్టకేలకు

jAGIR lAND

Jagir Lands: సుప్రీం కోర్టులో హైదరాబాద్ జాగీర్ భూముల కేసులో తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగానే తీర్పు వచ్చింది. సంవత్సరాల తరబడి వక్ఫ్ బోర్డుకు ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న కేసు విచారణ ఎట్టకేలకు కొలిక్కివచ్చింది.

మణికొండ భూముల కేసులో జరిగిన విచారణలో ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల విలువచేసే భూములు దక్కాయి. ఈ అంశంపై 2016 నుంచి సుప్రీంకోర్టులో కేసు నడుస్తూనే ఉంది.

సోమవారం వచ్చిన తీర్పుతో వెయ్యి 654 ఎకరాలపై ప్రభుత్వానికి సర్వ హక్కులు రానున్నాయి. 1654 ఎకరాలు 32 గుంటలు తమవేనంటూ వక్ఫ్ బోర్డు, వక్ఫ్ ట్రిబ్యునల్ మద్దతుతో మణికొండ దర్గా కోర్టుకెక్కింది. గతంలో హైకోర్టు ఉత్తర్వులు వక్ఫ్ బోర్డుకు అనుకూలంగా రావడంతో మరోసారి అవే ఫలితాలు ఆశించింది.

Read Also : వేగవంతమైన నడకతో….. గుండెఆరోగ్యం మెరుగు

దానికి విరుద్ధంగా మొత్తం భూములపై సర్వ హక్కులు తెలంగాణ ప్రభుత్వానికేనంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హేమంత్ గుప్తా, రామసుబ్రమణిన్ బెంచ్ తీర్పు నిచ్చింది.