Brisk Walk : వేగవంతమైన నడకతో….. గుండెఆరోగ్యం మెరుగు

వేగంగా నడవటం వల్ల శరీరంలో అధికంగా కేలరీలు ఖర్చవుతాయి. ఈజీగా బరువును తగ్గించుకోవచ్చు. వేగవంతమైన నడవటం వల్ల శరీరం దృఢంగా తయారవుతుంది.

Brisk Walk : వేగవంతమైన నడకతో….. గుండెఆరోగ్యం మెరుగు

2018 10 23 Airfit Paris Copyright:pauline Ballet

Brisk Walk : ప్రతిరోజూ వేగంగా నడవడం వల్ల హృదయ సంబంధిత వ్యాధులు చాలావరకు తగ్గుతాయని నిపుణులు తెలుపుతున్నారు. మామూలు నడక వల్ల క్యాన్సర్ వంటి వ్యాధుల ముప్పు తగ్గుతున్నట్టు, వేగంగా నడవడం వల్ల, హృదయ సంబంధిత వ్యాధుల ముప్పు భారీస్థాయిలో తగ్గుతున్నట్లు కొన్ని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. అమెరికాలోని బ్రౌన్ యూనివర్శిటీ జరిపిన పరిశోధనలో నెమ్మదిగా నడిచే వారి కంటే వేగంగా నడిచే మహిళల్లో గుండె ఆగిపోయే ప్రమాదం తక్కువగా ఉంటుందని తేలింది.

వేగంగా నడవడం వల్ల శరీరంలో రక్తప్రసరణ ప్రక్రియ సమతుల్యంగా ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు. గుండె మెరుగ్గా పనిచేస్తుంది. ఇది ఇతర గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. నెమ్మదిగా నడవడం వల్ల గుండె కండరాలకు కొంత నష్టం వాటిల్లుతుందని తేలింది. నెమ్మదిగా నడిచేవారి కంటే వేగంగా నడిచేవారు ఎక్కువ ప్రయోజనాలను పొందుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో ఉదయం పూట నడవటం వల్ల ఎక్కవ ఉపయోగం ఉంటుందని వారు సూచిస్తున్నారు.

వేగంగా నడవటం వల్ల శరీరంలో అధికంగా కేలరీలు ఖర్చవుతాయి. ఈజీగా బరువును తగ్గించుకోవచ్చు. వేగవంతమైన నడవటం వల్ల శరీరం దృఢంగా తయారవుతుంది. వేగంగా కండరాలను కదిలించడం ద్వారా కండరాలకు బలం చేకూరుతుంది. జీవక్రియను మెరుగుపడుతుంది. ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది. మీ శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గటంతోపాటు, పొట్ట వద్ద కొవ్వు కరిగిపోతుంది. వేగంగా నడక వల్ల గుండెకు ఆరోగ్యం చేకూర్చటంతోపాటు, రక్తపోటును నియంత్రిస్తుంది. డయాబెటిస్ నుంచి రక్షిస్తుంది.

ఉదయం సమయంలో వేగంగా నడవటం వల్ల శరీరంలో చురుకుదనం కలగటంతోపాటు, మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది. శరీరంలో అలసటకు కారణమైన హార్మోన్ గా ఈ మెలటోనిన్ ని చెప్తారు. రోజులో ఏసమయంలో నడిచినా ఇబ్బంది ఏమీ లేకపోయినప్పటికీ ఉదయం పూట నడవటం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. రాత్రి సమయంలో బాగా నిద్రపట్టేందుకు కూడా ఉదయం వేగంగా వాకింగ్ చేయటం ఉపకరిస్తుంది.