Telangana Police: తెలంగాణ పోలీసులకు కేంద్ర పతకాల పంట.. గ్రేహౌండ్స్ వీరులకు శౌర్య పురస్కారాలు
భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభసందర్భంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ (Telangana Police)శాఖకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత జాతీయ పతకాలను ప్రకటించింది.
- V Santhosh Kumar
- Published on- August 14, 2026 / 06:34 PM IST
Telangana greyhounds and intelligence officers win prestigious national police medals
- తెలంగాణ పోలీసులకు కేంద్ర పతకాలు
- ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట అవార్డులు
- గ్రేహౌండ్స్ వీరులకు శౌర్య పురస్కారాలు
Telangana Police: భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభసందర్భంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు చెందిన పలువురు అధికారులు, సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం అత్యున్నత జాతీయ పతకాలను ప్రకటించింది. విధుల్లో చూపిన అసమాన ధైర్యసాహసాలు, విశిష్ట సేవలు, నిబద్ధతకు గుర్తింపుగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను అందించింది.
రాష్ట్రపతి విశిష్ట సేవా, శౌర్య పతకాలు:
శాంతిభద్రతల (Telangana Police)పరిరక్షణలో విశిష్ట సేవలు అందించినందుకు ‘రాష్ట్రపతి విశిష్ట సేవా పతకానికి’ హైదరాబాద్ ఇంటెలిజెన్స్ ఎస్పీ ఆర్. జగదీశ్వర్ రెడ్డి, అదనపు డీసీపీ నర్సయ్య జోగుల ఎంపికయ్యారు. అలాగే ప్రాణాలకు తెగించి పోరాడిన గ్రేహౌండ్స్ రంగానికి చెందిన పీసీలు బి. సత్యరావు, కె. సందీప్ కుమార్, జె. వంశీకృష్ణలు అత్యంత ప్రతిష్టాత్మకమైన శౌర్య పతకాలను (PMG) దక్కించుకున్నారు.
ప్రశంసనీయ సేవా పురస్కారాలు:
రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కరీంనగర్ అదనపు డీసీపీ పి. వెంకటరమణ, సైబర్ క్రైమ్స్ ఏసీపీ శివ మారుతి, సీటీసీ ఏసీపీ గంగారామ్‌లతో పాటు పలువురు అధికారులకు ‘ప్రశంసనీయ సేవా పతకాలు’ లభించాయి. గ్రేహౌండ్స్‌కు చెందిన హోంగార్డు మేడిపల్లి యాదయ్య కూడా ఈ గౌరవాన్ని సాధించడం విశేషం.
