TS Health Director: నా వ్యాఖ్యలు వక్రీకరించారు .. నేను అలా అనలేదు.. దయచేసి వీడియో మొత్తం చూడండి ..

తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీంతో ఆయన గురువారం వివరణ ఇచ్చారు. తన ప్రసంగంలోని కొంత భాగాన్ని కట్‌చేసి కొందరు వివాదాన్ని సృష్టించారని అవేదన వ్యక్తంచేశారు. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నానని, నన్ను ఇబ్బంది పెట్టాలనే ఇలా చేశారని అన్నారు. పూర్తి వీడియోచూస్తే నా తప్పేమీ లేదని అందరికీ అర్థమవుతుందని తెలిపారు.

ts health director srinivasa rao

TS Health Director: ఏసుక్రీస్తు కృపవల్లే కరోనా మహమ్మారి తగ్గిందంటూ తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం విధితమే. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతుండటంతో శ్రీనివాసరావు స్పందించారు. నా వ్యాఖ్యలు వక్రీకరించారంటూ పేర్కొన్నాడు. కొందరు కావాలనే నాపై తప్పుడు ప్రచారం చేశారని, దయచేసి యూట్యూబ్‌లో ఉన్న ఫుల్ వీడియోను చూడాలని హితవుపలికారు. నా వ్యాఖ్యలపై వివాదం సృష్టించడం కలచివేసిందన్న శ్రీనివాసరావు.. నాకు అన్ని మతాలు సమానమేనని, అన్ని మతాలను, కులాలను నేను సమానంగా చూస్తానంటూ తెలిపారు.

Telangana Corona : మాస్క్ కంపల్సరీ.. కరోనాపై DH శ్రీనివాసరావు సూచనలు

నా కామెంట్స్ పై కొందరు తప్పుడు ప్రచారం చేయడం వల్లే వివాదంగా మారిందని, నేను మాట్లాడిన వీడియో మొత్తం చూస్తే.. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అర్థమవుతదని అన్నారు. సెమి క్రిస్మస్ వేడుకలు సందర్భంగా కొత్తగూడెంలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనం చేసిన సేవల వల్ల కరోనా తగ్గలేదని, ఏసు ప్రభువు కృప వల్లనే కరోనా తగ్గిందని అన్నారు. మన దేశానికి ఆదునిక వైద్యాన్ని, విద్యను తీసుకొచ్చింది క్రైస్తవులేనని చెప్పారు. అంతేకాక.. క్రైస్తవులతోనే దేశం అభివృద్ధి చెందిందని, క్రైస్తవులు లేకపోతే ప్రపంచ దేశాల్లో భారత్ మనుగడ సాగించేది కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. పలు హిందూ సంఘాలు ఆయన వ్యాఖ్యలను తప్పుబట్టాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీయడంతో గురువారం వివరణ ఇచ్చారు. తన ప్రసంగంలోని కొంత భాగాన్ని కట్‌చేసి కొందరు వివాదాన్ని సృష్టించారని అవేదన వ్యక్తంచేశారు. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నానని, నన్ను ఇబ్బంది పెట్టాలనే ఇలా చేశారని, పూర్తి వీడియోచూస్తే నా తప్పేమీ లేదని అందరికీ అర్థమవుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ, ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంపూర్ణ సహకారం, ఇతర శాఖల మద్దతుతోనే కరోనాను నియంత్రించగలిగామని తన వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.