Telangana Corona : మాస్క్ కంపల్సరీ.. కరోనాపై DH శ్రీనివాసరావు సూచనలు

రాష్ట్ర ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. కేసులు ఇక్కడ అధికం కావొద్దు అనుకుంటే.. తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. 60 ఏళ్ళు నిండిన ప్రతీ ఒక్కరూ...

Telangana Corona : మాస్క్ కంపల్సరీ.. కరోనాపై DH శ్రీనివాసరావు సూచనలు

Corona

Health Director Srinivas Press Virus : కరోనా వైరస్ భయం ఇంకా పోలేదు.. మాస్క్ తప్పనిసరిగా ధరించండి.. ఎవరైనా వ్యాక్సిన్ వేసుకోకపోతే..వారంతా తప్పకుండా వేసుకోవాలంటూ తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు రాష్ట్ర ప్రజలకు సూచించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరోసారి విజృంభిస్తుండడం, భారతదేశంలో రోజురోజుకు పాజిటివ్ కేసులు అధికమౌతుండడంతో వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ అయ్యింది. అందులో భాగంగా.. 2022, ఏప్రిల్ 21వ తేదీ గురువారం ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. పక్క రాష్ట్రాల్లో కరోనా కేసులు అధికమౌతుండడంతో రాష్ట్ర ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. కేసులు ఇక్కడ అధికం కావొద్దు అనుకుంటే.. తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. 60 ఏళ్ళు నిండిన ప్రతీ ఒక్కరూ బూస్టర్ డోస్ వ్యాక్సిన్ వేసుకోవాలని, 12 ఏళ్ళు పైబడిన పిల్లలందరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు.

Read More : Omicron BA.2.12.1 : ఢిల్లీ కరోనా బాధితుల్లో ఒమిక్రాన్ మ్యూటెంట్ వేరియంట్.. కొత్త కేసులకు కారణమిదేనా?

దేశంలో ఆర్ వ్యాల్యూ అనేది పూర్తిగా కంట్రోల్ లోనే ఉందన్న ఆయన దేశ రాజధాని ఢిల్లీలో 1 శాతం కంటే ఎక్కువగా ఉందని తెలిపారు. ఇక తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే.. ఇక్కడ ఆర్ వ్యాల్యూ 0.5 మాత్రమే ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతొక్కరూ మాస్క్ ధరించాలని, ఫోర్త్ వేవ్ రాబోదు అని సర్వేలు చెప్తున్నాయన్నారు. NIN, ICMR సిరో సర్వే ఆధారంగా సర్వేలు జరిగాయన్నారు. 93 శాతం ప్రజల్లో కోవిడ్ యాంటీ బాడీస్ ఉన్నట్లు సిరో సర్వేల్లో వెల్లడైందనే విషయాన్ని ఆయన వెల్లడించారు. ప్రజలందరూ ధైర్యంగా ఉండండి..అలాగని కరోనా భయం పోలేదన్నారు. రాబోయే రోజుల్లో శుభకార్యాలు చాలా ఉండడంతో ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని మరోసారి సూచించారు డీహెచ్.

Read More : Srikakulam : ఆ ఊర్లో కరోనా కేసులు లేకున్నా లాక్‌డౌన్‌.. ఎందుకో తెలుసా?

దేశంలో బుధవారం మొత్తం 4.49 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 2,380 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో నిన్నటి కేసులతో పోల్చితే గురువారం ఒక్కరోజే 60శాతం పెరుగుదల కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. దీనికితోడు పాజిటివిటీ రేటు 5.7శాతానికి పెరిగింది. దేశంలో గడిచిన 24గంటల్లో 56 మంది కొవిడ్ తో ప్రాణాలు కోల్పోయారు. బుధవారం సాయంత్రం వరకు కొవిడ్ చికిత్స పొందుతున్న వారి సంఖ్య 13,433గా ఉంది. ఢిల్లీలో తాజాగా 1,009 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో సంగం వరకు ఢిల్లీలోనే నమోదు కావటం గమనార్హం. దీనికితోడు కేరళలలోనూ కొవిడ్ కేసుల తీవ్ర పెరుగుతోంది.