Srikakulam : ఆ ఊర్లో కరోనా కేసులు లేకున్నా లాక్‌డౌన్‌.. ఎందుకో తెలుసా?

పిల్లలు బడికి వెళ్లకుండా.. స్కూల్‌కు కూడా తాళం వేసేశారు గ్రామస్తులు. శ్రీకాకుళం జిల్లా వెన్నలవలసలో జరిగిన ఈ ఘటన.. చుట్టుపక్కల గ్రామాల్లో ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

Srikakulam : ఆ ఊర్లో కరోనా కేసులు లేకున్నా లాక్‌డౌన్‌.. ఎందుకో తెలుసా?

Srikakulam

Srikakulam Lockdown : ఆ ఊర్లో లాక్‌డౌన్‌ పెట్టేశారు. కరోనా వచ్చిందనో.. మరేదో అంటురోగం వచ్చిందనో కాదు.. ఊరికి అరిష్టం పట్టిందంటూ సరిహద్దులు మూసేశారు. దుష్టశక్తుల పేరుతో గ్రామం చుట్టూ కంచె వేసి.. వాటిని తరిమేయాలంటూ మాంత్రికులను రప్పించి మరీ అర్ధరాత్రి వేళల్లో పూజలు జరిపించారు. ఊరి చుట్టూ మంత్రాల కంచె వేసి.. ఎనిమిది రోజుల పాటు.. ఊర్లోని ప్రజలు ఎవరూ బయటకు వెళ్లకుండా.. బయటి గ్రామాల ప్రజలు తమ ఊర్లోకి రాకుండా కట్టుదిట్టం చేశారు.

పిల్లలు బడికి వెళ్లకుండా.. స్కూల్‌కు కూడా తాళం వేసేశారు గ్రామస్తులు. శ్రీకాకుళం జిల్లా వెన్నలవలసలో జరిగిన ఈ ఘటన.. చుట్టుపక్కల గ్రామాల్లో ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా గ్రామస్తులు మరణిస్తుండటంతో.. తమ ఊరికి అరిష్టం పట్టిందని ఫిక్స్ అయిపోయారు వెన్నలవలస వాసులు. ఎలాగైనా ఈ అరిష్టం పొగొట్టాలంటూ.. పెద్ద పెద్ద మాంత్రికులను సంప్రదించారు.

Mahabubabad : చేతబడి నెపంతో మూడు కుటుంబాలు వెలి

వారి సూచన మేరకే కంచె వేసి.. అర్ధరాత్రి సమయంలో పూజలు చేసినట్లు తెలుస్తోంది. అయితే గ్రామస్తులు మాత్రం.. తమ ఊరికి అరిష్టం పట్టిందని.. ఊరి బాగు కోసమే పూజలు చేసి.. గ్రామంలోకి ఎవరూ రాకుండా కట్టుదిట్టం చేశామంటున్నారు.