TS High Court : మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు ధ్రువ పత్రాలు సమర్పించారని మహబూబ్ నగర్ ఓటర్ రాఘవేంద్ర రాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Srinivas Goud (2)

Minister Srinivas Goud Petition : తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు టీఎస్ హైకోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల అఫిడవిట్‌పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. తన ఎన్నిక చెల్లందంటూ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేయాలని కోరుతూ శ్రీనివాస్ గౌడ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు ధ్రువ పత్రాలు సమర్పించారని మహబూబ్ నగర్ ఓటర్ రాఘవేంద్ర రాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శ్రీనివాస్ గౌడ్ కు ఎమ్మెల్యే, మంత్రిగా కొనసాగే అర్హత లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ఓటర్ రాఘవేంద్ర రాజు పిటిషన్ ను కొట్టివేయాలని శ్రీనివాస్ గౌడ్ పిటిషన్ వేశారు.

High Court : తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు, కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావును ప్రకటించిన ధర్మాసనం

ఇప్పటికే హైకోర్టులో ఇరువురి వాదనలు పూర్తి అయ్యాయి. శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. పిటిషనర్ వేసిన పిటిషన్ ను హైకోర్టు అనుమతించింది. పిటిషనర్ దాఖలు చేసిన పిటిషన్ పై ధర్మాసనం విచారణ చేపట్టనుంది.