High Court : బుద్వేల్ భూముల వేలంకు లైన్ క్లియర్.. స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరణ

బార్ అసోసియేషన్ లో విబేధాలున్నాయని ధర్మాసనం తెలిపింది. అందరూ ఏకాభిప్రాయంతో వస్తే వాదనలు వింటామని చెప్పింది.

Telangana High Court (2)

High Court Refused Stay : హైదరాబాద్ నగర శివారు బుద్వేల్ భూముల వేలం ప్రక్రియకు లైన్ క్లియర్ అయింది. బుద్వేల్ భూముల వేలంపై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. బుద్వేల్ భూములను హెచ్ఎండీఏ వేలం వేయడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాదుల సంఘం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

భూముల వేలంపై స్టే ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొంది. అయితే లంచ్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు నిరాకరించింది. బార్ అసోసియేషన్ లో విబేధాలున్నాయని ధర్మాసనం తెలిపింది. అందరూ ఏకాభిప్రాయంతో వస్తే వాదనలు వింటామని చెప్పింది. బుద్వేల్ భూములు వేలం వేయవద్దని హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది.

Neopolis Layout Kokapet: అందరి దృష్టి కోకాపేటపైనే.. అసలు నియోపోలిస్ అంటే అర్థం ఏంటి?

భూముల వేలాన్ని సవాల్ చేస్తూ హైకోర్టు బార్ అసోసియేషన్ హైకోర్టులో పిల్ వేసింది. ఆ భూములను హైకోర్టు నిర్మాణానికి కేటాయించేలా ప్రస్తుత హెచ్ఎండీఏ వేలాని ఆపాలని కోరింది. ఆ భూములను హైకోర్టు నిర్మాణానికి కేటాయించాలని విజ్ఞప్తి చేసింది.

ఈ పిటిషన్ ఇవాళ కోర్టులో లిస్టింగ్ రానుంది. మరోవైపు భూముల వేలంపై దాఖలు చేసింది. హైకోర్టు నిర్మాణానికి బుద్వేల్ లో వంద ఎకరాలు కేటాయించాలని 2012 నుంచి కోరుతున్నామని బార్ అసోసియేషన్ తెలిపింది.