Telangana LRS Scheme: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు బిగ్ అలర్ట్.. నేటితో ముగియనున్న గడువు.. సర్కార్ కీలక నిర్ణయం
తెలంగాణలో అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం తెచ్చిన LRS(Telangana LRS Scheme) గడువు ఈ నెల 31తో ముగుస్తుండటంతో, ప్రభుత్వం దీనిపై కీలక నిర్ణయం తీసుకోనుంది.
- V Santhosh Kumar
- Published on- July 31, 2026 / 02:39 PM IST
Telangana illegal layouts regularisation scheme last date extended
- ఈనెల 31తో ఎల్ఆర్ఎస్ గడువు
- మరోసారి పొడిగించే అవకాశం ఉంది
- 25 శాతం రాయితీ సదుపాయం
Telangana LRS Scheme: తెలంగాణలో అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం తెచ్చిన LRS (Telangana LRS Scheme)గడువు ఈ నెల 31తో ముగుస్తుండటంతో, ప్రభుత్వం దీనిపై కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ గడువును మరోసారి పొడిగించే అవకాశం కనిపిస్తోంది. దాదాపు ఏడాదిన్నర కాలంగా ఎప్పటికప్పుడు గడువు పెంచుతున్నప్పటికీ, ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. పాత దరఖాస్తుల పరిష్కారంలో జరుగుతున్న ఆలస్యం కారణంగా కొత్తవారు కూడా ముందుకు రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గత ప్రభుత్వ హయాంలో LRS పథకం ప్రకటించగా, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25.70 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, గతేడాది మార్చిలో బాధితులకు ఊరటనిస్తూ ఫీజు చెల్లింపుల్లో రాయితీలు ప్రకటించింది. ఈ పథకం కింద క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం అందించిన వెసులుబాట్లు, ప్రస్తుత పరిస్థితి వివరాలు ఇలా ఉన్నాయి.
* ఫీజు రాయితీలు: LRS దరఖాస్తుదారులు చెల్లించాల్సిన ఫీజులో ప్రభుత్వం మొదట 50%, ఆ తర్వాత 25% రాయితీని మినహాయించింది.
* కమిషనర్ల విజ్ఞప్తి: ‘సర్’ ప్రక్రియలో బిజీగా ఉండటం వల్ల LRSపై దృష్టి పెట్టలేకపోయామని, గడువు పొడిగించాలని హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్లు కోరారు.
* సానుకూల సంకేతాలు: కమిషనర్ల విజ్ఞప్తిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం, LRS చెల్లింపుల రాయితీ గడువును మరోసారి పెంచేందుకు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ప్రస్తుత రాయితీ గడువు శుక్రవారంతో ముగుస్తుండటంతో, ప్రభుత్వం నుంచి త్వరలోనే గడువు పొడిగింపుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరి ఈ గడువులో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.
