Indiramma Bheema Scheme: రాష్ట్రంలో కొత్త సంక్షేమ పథకం.. నవంబర్ నుంచే ‘ఇందిరమ్మ బీమా’.. ప్రతి ఇంటికీ రూ.5 లక్షలు!

తెలంగాణలోని ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో ‘ఇందిరమ్మ బీమా (Indiramma Bheema Scheme)’ కొత్త పథకాన్ని మొదలుపెట్టింది.

Telangana indiramma beema scheme launch on november 19

Indiramma Bheema Scheme: తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం మరో సంచలన సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందించే ‘ఇందిరమ్మ బీమా’ పథకాన్ని రాబోయే నవంబర్ 19వ తేదీన అధికారికంగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంచలన ప్రకటన చేశారు. ఆరోగ్యశ్రీ పరిమితిని పెంపుదల చేయడంతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహాలకు ఉచిత విద్యుత్ వంటి హామీలను విజయవంతంగా అమలు చేస్తున్న ప్రభుత్వం, ఈ బీమా పథకం ద్వారా ప్రజల జీవితాలకు పూర్తి రక్షణ కల్పిస్తుందని పేర్కొన్నారు.

Read Also – Medaram Mini Jatara: ‘మేడారం మినీ జాతర’ తేదీలు ఖరారు.. 4 రోజులు ప్రత్యేక పూజలు.. ఏర్పాట్లకు సిద్ధమవుతున్న ప్రభుత్వం!

ప్రజా సంక్షేమమే ధ్యేయం – 1.06 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ:

ఖమ్మం జిల్లా చింతకాని, బోనకల్, ముదిగొండ మండలాల్లో కలెక్టర్ దివాకర, సీపీ సునీల్‌తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తోందని, అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా 1.06 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తూ దేశంలోనే తెలంగాణను మోడల్‌గా నిలిపామని తెలిపారు. నియోజకవర్గాల్లో పాఠశాలలు, ఆస్పత్రులు, రహదారుల నిర్మాణాలను వేగవంతం చేసి ముఖచిత్రాన్ని మారుస్తున్నామని వెల్లడించారు.

క్షేత్రస్థాయిలో పర్యటన – చిరు వ్యాపారులకు ప్రభుత్వ అండ:

పర్యటన సందర్భంగా ముదిగొండలో 50 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించిన భట్టి విక్రమార్క, స్థానిక టీస్టాల్ వద్ద టీ తాగుతూ సామాన్య ప్రజలతో ముచ్చటించారు. చిరు వ్యాపారులను ఆప్యాయంగా పలకరించి ప్రభుత్వ పథకాల అమలుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, రాజీవ్ యువవికాసం కింద స్వయం ఉపాధికి ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ గ్రామాల్లో సంక్షేమ ఫలాలను ప్రతీ ఇంటికీ చేర్చాలని ఆయన పిలుపునిచ్చారు.