TG Inter Academic Calendar : జూన్ ఫస్ట్ నుంచి ఇంటర్ క్లాసులు ప్రారంభం.. ఫైనల్ ఎగ్జామ్స్ ఎప్పుడు.. దసరా సెలవులు ఎన్ని రోజులంటే
TG Inter Academic Calendar : తెలంగాణ ఇంటర్ బోర్డు.. 2026-27 విద్యా సంవత్సరానికి గాను అకాడమిక్ క్యాలెండర్ ని విడుదల చేసింది.
- Dharani Pilli
- Published On : March 31, 2026 / 08:38 AM IST
telangana inter board released 2026 67 academic calendar holiday list
TG Inter Academic Calendar : తెలంగాణ విద్యాశాఖ.. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ క్లాసులు ప్రారంభం ఎప్పుడు, బోర్డు పరీక్షల నిర్వహణ, దసరా సెలవులు ఎన్ని రోజులు వంటి అంశాలపై క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఇంటర్మీడియట్ అకడమిక్ క్యాలెండర్ను తెలంగాణ ఇంటర్ బోర్డు సెక్రటరీ విడుదల చేశారు. దీని ప్రకారం.. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ రెండు తరగతులకు కూడా జూన్ 1 నుంచి క్లాసులు ప్రారంభించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. అలానే 2026-27 విద్యా సంవత్సరంలో ఇంటర్ విద్యార్థులకు మొత్తం 304 రోజులు ఉండగా.. వీటిల్లో సెలవులు పోను.. 224 పనిదినాల్లో కాలేజీలు నడవనున్నాయి.
అలానే ఇంటర్ విద్యార్థులకు నిర్వహించబోయే పరీక్షల షెడ్యూల్ను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఇంటర్ విద్యార్థులకు
- అక్టోబర్ 3-9 వరకు హాఫ్ ఇయర్లీ (Half-yearly) పరీక్షలు నిర్వహించనున్నారు.
- అలానే 2027, జనవరి 18-23 వరకు ప్రీఫైనల్,
- ఆ తర్వాత నుంచి వార్షిక ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమవుతాయని వెల్లడించింది.
ఇప్పటి వరకు తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు దసరా సెలవులు అంటే కేవలం 3, 4 రోజులు లేదా మహా అయితే వారం రోజులు మాత్రమే ఇచ్చేవారు. అయితే ఈ విద్యా సంవత్సరంలో స్కూల్ విద్యార్థులతో సమానంగా ఇంటర్ విద్యార్థులకు కూడా 12 రోజులు దసరా సెలవులు ఇవ్వనున్నారు.
- అక్టోబర్ 10 నుంచి 21 వరకు దసరా సెలవులు ఉండనున్నాయి.
- సంక్రాంతి సెలవులు 2027, జనవరి 13 నుంచి 17 వరకు ఉండనున్నాయి.
- మార్చి 27ను లాస్ట్ వర్కింగ్ డేగా ప్రకటించారు. మార్చి 28 నుంచి మే 30 వరకు వేసవి సెలవులు ఉంటాయి.
ప్రైవేట్ కాలేజీలు అకడమిక్ క్యాలెండర్ను కచ్చితంగా పాటించాలని సెక్రటరీ కృష్ణ ఆదిత్య ఆదేశించారు.
