×
Ad

విద్యార్థులకు అలర్ట్‌.. ఇంటర్ పరీక్ష ఒకరోజు వాయిదా.. ఎందుకంటే?

ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు త్వరలోనే విడుదల అవుతాయి.

Inter Exams: తెలంగాణలో మార్చి 3న జరగాల్సిన ఇంటర్‌ ద్వితీయ సంవత్సర పరీక్ష మార్చి 4కు వాయిదా పడింది. మిగతా పరీక్షలన్నీ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి.

మార్చి 3న హోలీ పండుగ నేపథ్యంలో ఆ రోజున జరగాల్సిన ఇంటర్మీడియెట్ ఇంటర్‌ ద్వితీయ సంవత్సర పరీక్షను మరుసటి రోజున నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు త్వరలోనే విడుదల అవుతాయి.

మొదట, మార్చి 4న హోలీ పండుగ ఉంటుందని ఇంటర్‌ అధికారులు భావించి ఆ రోజున సెలవు ఇచ్చారు. అయితే, సర్కారు ఇటీవల విడుదల చేసిన సెలవుల జాబితాలో మార్చి 3న హోలీ పండుగ సెలవు దినంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఆ ఒక్కరోజు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నారు.

కాగా, తెలంగాణ ఇంటర్‌ పరీక్షలు ఫిబ్రవరి 25 తేదీ నుంచి ప్రారంభమవుతాయి. 25న ఫస్టియర్, 26న సెకండియర్‌ పరీక్షలు ప్రారంభమవుతాయి. సబ్జెక్టుల వారీగా షెడ్యూల్‌ను ఇప్పటికే ఇంటర్‌బోర్డు విడుదల చేసింది. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయి.