Intermediate Exams Results : తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ పరీక్ష ఫలితాలు విడుదల

ఇంటర్ ఫస్టియర్ లో 49 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు. బాలికలు 56 శాతం, బాలురు 42 శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు.

Intermediate first year exam results : తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం (డిసెంబర్ 16, 2021) మధ్యాహ్నం ఇంటర్ ఫస్టియర్ ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు విడుదల చేశారు. ఫస్టియర్ లో 49 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. బాలికలు 56 శాతం, బాలురు 42 శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 6,59,222 మంది విద్యార్థులు పరీక్ష రాశారని తెలిపారు. వీరిలో 2,24,012 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు. ఫలితాలను ఇంటర్ బోర్డు వెబ్ సైట్ లో ఉంచినట్లు పేర్కొన్నారు. ఫలితాల కోసం http://tsble.cgg.gov.in వెబ్ సైట్ ను లాగిన్ అయి చూడొచ్చని తెలిపారు. మార్కుల మెమోలను 17వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

Central Government : కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చంతా రాష్ట్ర ప్రభుత్వానిదే : కేంద్రం

ప్రస్తుతం సెకండియర్ చదువుతున్న విద్యార్థులకు ఫస్టియర్ ఇయర్ పరీక్షలను ఈ ఏడాది అక్టోబర్ 25 నుంచి నవంబర్ 3 వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు జనరల్ విద్యార్థులు 4,09,911 మంది, ఒకేషనల్ విద్యార్థులు 49,331 మంది హాజరయ్యారు.

మొత్తం 4,59,242 మంది విద్యార్థులు. కాగా జనరల్ విద్యార్థులు 1,99,786 మంది, ఒకేషనల్ విద్యార్థులు 24,226 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 2,24,012 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు బోర్డు అధికారులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు