Janasena List : జనసేన అభ్యర్థుల జాబితా విడుదల.. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారంటే..

Janasena Mla Candidates List : తెలంగా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఖరారైన సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా బీజేపీ.. 8 అసెంబ్లీ నియోజకవర్గాలను జనసేనకు కేటాయించింది.

Janasena Mla Candidates List

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది జనసేన. 8మందితో లిస్ట్ ను ప్రకటించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఖరారైన సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా బీజేపీ.. 8 అసెంబ్లీ నియోజకవర్గాలను జనసేనకు కేటాయించింది. జనసేన పోటీ చేస్తున్న స్థానాలు, అభ్యర్థుల పేర్లు ఈ విధంగా ఉన్నాయి..

కూకట్ పల్లి – ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్
తాండూరు – నేమూరి శంకర్ గౌడ్
కోదాడ – మేకల సతీశ్ రెడ్డి
నాగర్ కర్నూల్ – వంగ లక్ష్మణ్ గౌడ్
ఖమ్మం – మిర్యాల రామకృష్ణ
కొత్తగూడెం – లక్కినేని సురేందర్ రావు
వైరా (ఎస్టీ)- డా.తేజావత్ సంపత్ నాయక్
అశ్వారావుపేట (ఎస్టీ) – ముయబోయిన ఉమాదేవి.

Also Read : బీజేపీ సభలో ఇంట్రస్టింగ్ సీన్.. పక్కపక్కనే ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్.. పవన్‌తో ఏం మాట్లాడారు?

పొత్తులో భాగంగా 8 అసెంబ్లీ స్థానాలు జనసేకు ఇచ్చేందుకు ఇదివరకే బీజేపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే జనసేన 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కూకట్ పల్లి నుంచి బరిలోకి దిగనున్న ప్రేమ్ కుమార్ మొన్నటి వరకు బీజేపీలో ఉన్నారు. నిన్ననే ఆయన జనసేనాని పవన్ కల్యాణ్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. ప్రేమ్ కుమార్ బీజేపీ నుంచి కూకట్ పల్లి టికెట్ ఆశించారు.

కాగా, 9 సీట్లు కేటాయించాలని జనసేన పట్టుబట్టినా.. 8 స్థానాలు మాత్రమే ఇచ్చేందుకు బీజేపీ అంగీకారం తెలిపింది. శేరిలింగంపల్లి స్థానం కూడా తమకే ఇవ్వాలని జనసేన అడిగినా.. అందుకే బీజేపీ పెద్దలు ఒప్పుకోలేదు. శేరిలింగంపల్లి స్థానాన్ని జనసేనకు ఇస్తే తాను బీజేపీకి రాజీనామా చేస్తానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పడంతో ఆ పార్టీ పెద్దలు వెనక్కి తగ్గినట్లు సమాచారం.

Also Read : హైదరాబాద్‌లో ప్రధాని మోదీ సభకు ఎమ్మెల్యే రాజాసింగ్ ఎందుకు రాలేదు? అసలేం జరిగింది?

జనసేన అభ్యర్థులు..

 

Janasena Mla Candidates List

ట్రెండింగ్ వార్తలు