Gutta Sukhendar Reddy : ధాన్యం విషయంలో కేంద్రం రైతులను ఇబ్బంది పెట్టొద్దు : గుత్తా సుఖేందర్ రెడ్డి

పంజాబ్ లో లాగానే కేంద్రం తెలంగాణ నుండి ధాన్యం కొనుగోలు చేయాలి.. లేదా బాయిల్డ్ రైస్ అయినా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రెండూ కుదరవంటే తెలంగాణ రైతులకు నష్టం చేయడమేనని తెలిపారు.

Gutta Sukhendar Reddy : ధాన్యం విషయంలో కేంద్ర ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించవద్దని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో రబీలో రా రైస్ రాదని తెలిపారు. రా రైస్ మాత్రమే ఇవ్వాలని చెప్పడం సరికాదని అభిప్రాయపడ్డారు. నల్గొండ జిల్లాలో శుక్రవారం(మార్చి25,2022) ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో గుత్తా సుఖేందర్ రెడ్డి కామెంట్స్ చేశారు. ఈ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు.

తెలంగాణ పట్ల ఎందుకు కేంద్రం కక్ష్య పూరితంగా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదన్నారు. పంజాబ్ లో లాగానే కేంద్రం తెలంగాణ నుండి ధాన్యం కొనుగోలు చేయాలి.. లేదా బాయిల్డ్ రైస్ అయినా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రెండూ కుదరవంటే తెలంగాణ రైతులకు నష్టం చేయడమేనని తెలిపారు. కేంద్రం బాయిల్డ్ రైస్ కొనకపోతే రైతులు తమ ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముకోవాల్సివస్తందన్నారు.

TRS : కేంద్రంపై రెండువైపులా టీఆర్ఎస్ దాడి.. ఇటు ఢిల్లీలో అటు గల్లీలో

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పందన బాధాకరం అన్నారు. ధాన్యం సేకరణ విషయంలో తెలంగాణకు సహకరించాలని ఓ రైతుగా కేంద్రాన్ని కోరుతున్నట్లు పేర్కొన్నారు. బాయిల్డ్ రైస్ కొనమని చెప్పి ఎంత ఇస్తారో చెప్పమని అడగడం సరికాదన్నారు. రెండవసారి శాసనమండలి చైర్మన్ గా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ కు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు