×
Ad

Local Body Elections: డైలమాలో తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు.. దీనిపై సస్పెన్స్

ఎన్నికలు జరగవని ఖర్చు పెట్టుకుండా ఉంటే వెనకబడిపోయే పరిస్థితి. ఒకవేళ ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు దసరా సందర్భంగా యాటలు, లిక్కర్ బాటిల్స్ ఇస్తే ఖర్చు తడిసిమోపెడు అవడం ఖాయం.

Local body MLC Elections

Local Body Elections: ఒక అడుగు ముందుకు..రెండు అడుగులు వెనక్కు. ఏడాదిగా స్థానిక సమరం తెలంగాణలో హీటెక్కిస్తోంది. ఎప్పుడు రేపోమాపో ఎన్నికలన్నట్లుగానే డెవలప్‌మెంట్స్ కనిపిస్తూ వస్తున్నాయ్. కానీ ఈ సారి ఇంకా డిఫరెంట్ సినారియో ఉంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ..2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది.

ఓ వైపు రిజర్వేషన్ల పెంపు అంశం కోర్టులో పెండింగ్‌లో ఉండగానే..ఇటు తెలంగాణ ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 9వ తేదీన నోటిఫికేషన్..అదే రోజు నామినేషన్లు ప్రారంభమవుతాయని ఎస్ఈసీ తెలిపింది. అయితే ఇప్పటికే రిజర్వేషన్ల కోటా 50శాతం దాటడంపై హైకోర్టు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. విచారణ జరిపిన హైకోర్టు..తదుపరి విచారణను అక్టోబర్‌ 8కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో అక్టోబర్‌ 8న కోర్టు ఇచ్చే ఆదేశాలే లోకల్ బాడీ ఎన్నికల ఉన్నట్లా..లేనట్లా అనేది తేల్చనుంది.

Also Read: బాలయ్య ఎపిసోడ్‌.. త్వరలో చిరుతో బాబు భేటీ? ఎందుకంటే?

రిజర్వేషన్లపై జీవో రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు..కావాలంటే ఎన్నికలను వాయిదా వేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. గవర్నర్‌ దగ్గర బిల్లు పెండింగ్‌లో ఉన్నప్పుడు జీవో ఎలా ఇస్తారు.? 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండకూడదన్న విషయం తెలియదా..? అంటూ ప్రశ్నించింది కోర్టు. ఈ సందర్భంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మూడు తీర్పులనూ హైకోర్టులో ప్రస్తావించారు పిటిషనర్ తరఫు న్యాయవాది.

అయితే సెప్టెంబర్‌ 30లోపు ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశిందన్న విషయాన్ని లేవనెత్తారు అడ్వకేట్ జనరల్. దీంతో అవసరమైతే మరో 2, 3నెలల సమయం కోరుతూ అఫిడవిట్‌ వేసుకోవాలని సలహా ఇచ్చింది కోర్టు. అలాగే నోటిఫికేషన్‌ ఎప్పుడు ఇస్తారని ఈసీని హైకోర్టు అడగగా ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్‌ ఇస్తామని ఈసీ చెప్పింది. ఒకవేళ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చినా విచారిస్తామని స్పష్టం చేసింది న్యాయస్థానం. ఈ క్రమంలో అక్టోబర్ 8న హైకోర్టు ఇచ్చే ఆదేశాల మీదే లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణ ఆధారపడి ఉంటుంది.

మహారాష్ట్ర ఎపిసోడ్‌ను గుర్తుచేస్తున్న ఎక్స్‌పర్ట్స్‌

అయితే మహారాష్ట్ర ఎపిసోడ్‌ను గుర్తు చేస్తున్నారు లీగల్ ఎక్స్‌పర్ట్స్‌. మహారాష్ట్రలో అక్కడి ప్రభుత్వం..స్థానిక ఎన్నికల్లో 50శాతం లిమిట్‌ను దాటి..రిజర్వేషన్లు పెంచి..ఎన్నికలు వెళ్లింది. ఎన్నికలు అయిపోయాయి. స్థానిక ఎన్నికల కూడా ఫలితాలు వచ్చాయి. ఆ తర్వాత ఆరు నెలలకు కోర్టు విచారణ చేపట్టి..ఎన్నికల్లో గెలిచిన వారి సభ్యత్వాలను కూడా రద్దు చేసింది. మళ్లీ రిజర్వేషన్ల కోటా 50శాతానికి లోబడి..ఎన్నికలు పెట్టాలని ఆదేశించింది.

న్యాయస్థానం ఆర్డర్స్ ప్రకారం మహారాష్ట్రలో మళ్లీ స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 50శాతం రిజర్వేషన్ దాటొద్దన్న నిబంధనను అతిక్రమించడానికి వీళ్లేదు. ఈ క్రమంలో తెలంగాణలో కూడా స్థానిక ఎన్నికల్లో బీసీ కోటా ఇప్పట్లో సాధ్యం కాదన్న టాక్ వినిపిస్తోంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే షెడ్యూల్ రిలీజ్ చేసింది కాబట్టి..ఎన్నికలు ఆపొద్దు అనుకుంటే చట్టప్రకారం బీసీ రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ కాకుండానే ఎలక్షన్స్‌ జరుగొచ్చు. ఒకవేళ బీసీ కోటా అమలు చేశాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలంటే మాత్రం..లోకల్ బాడీ పోల్స్‌ మరోసారి వాయిదా పడటం ఖాయమని అంటున్నారు లీగల్ ఎక్స్‌పర్ట్స్‌.

మరోవైపు ఇప్పటికే గ్రామాల్లో స్థానిక అలజడి స్టార్ట్ అయింది. పోటీ చేసే అభ్యర్థులు ఆల్రెడీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. సరిగ్గా ఇదే టైమ్‌లో దసరా పండుగ కూడా వస్తుంది. దీంతో ఎన్నికల బరిలో నిలవాలనుకునే ఆశావహులు కూడా కోర్టు టెన్షన్ పెడుతోంది. ఎన్నికలు జరుగుతాయో..వాయిదా పడుతాయో తెల్వదు.

ఎన్నికలు జరగవని ఖర్చు పెట్టుకుండా ఉంటే వెనకబడిపోయే పరిస్థితి. ఒకవేళ ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు దసరా సందర్భంగా యాటలు, లిక్కర్ బాటిల్స్ ఇస్తే ఖర్చు తడిసిమోపెడు అవడం ఖాయం. తీరా అంత ఖర్చు పెట్టి హంగామా చేశాక ఎన్నికలు వాయిదా పడితే పరిస్థితి ఏంటని లోకల్ లీడర్లు కూడా ఆందోళనలో ఉన్నారట. ఈ నేపథ్యంలో అక్టోబర్ 8న హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతుందో..? స్థానిక పోరు ఉన్నట్లా.? లేనట్లా.? అనేది వారం రోజులు వెయిట్ చేయాల్సిందే.