Jagadish Reddy : తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డికి కరోనా

డాక్టర్ల సూచన మేరకు తాను ఐసోలేషన్ లో ఉన్నానని, చికిత్స పొందుతున్నానని మంత్రి పేర్కొన్నారు. తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, అలాగే జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

Corona (5)

Jagadish Reddy Corona positive : తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డికి కరోనా వైరస్ సోకింది. తనకు స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయని, పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఆయన తెలిపారు. డాక్టర్ల సూచన మేరకు తాను ఐసోలేషన్ లో ఉన్నానని, చికిత్స పొందుతున్నానని మంత్రి పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని, అలాగే జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రాష్ట్రంలో నిన్న 1,825 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. కరోనాతో ఒకరు మృతి చెందారు.

పాజిటివిటీ రేటు 3.5 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గింది. గడిచిన 24 గంటల్లో 351 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు కాస్త తగ్గి 97.26 శాతంగా ఉంది. నిన్న రాష్ట్రంలో 70, 697 టెస్టులు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14వేల 995 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో 1,042 కేసులు నమోదు అయ్యాయి. ఆ తర్వాత మల్కాజ్‌గిరిలో 201 కేసులు రాగా.. రంగారెడ్డిలో 147, సంగారెడ్డిలో 51, హన్మకొండలో 47, ములుగులో 2 చొప్పున కరోనా కేసులు నమోదు అయ్యాయి.

Tragedy : ఈతకెళ్లి మున్నేరు వాగులో ఐదుగురు విద్యార్థులు గల్లంతు.. నలుగురి మృతదేహాలు వెలికితీత

రాష్ట్రంలో కరోనా, ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్న క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా ఆంక్షల గడువును జనవరి 20 వరకు పొడిగించింది. తెలంగాణలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కోవిడ్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఆంక్షలు కఠినతరం చేసింది.