KTR Comments On Amit Shah
KTR Comments On Amit Shah : తెలంగాణ ఆత్మగౌరవాన్ని, ప్రజల ఆకాంక్షలను ఢిల్లీ బాద్‌షాలు ఎన్నటికీ అర్థం చేసుకోలేరని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ విషయం మునుగోడులో అమిత్‌షా ప్రసంగంతో మరోసారి రుజువైందన్నారు. వేల కోట్లతో ఎమ్మెల్యేని కొన్నట్టుగా తెలంగాణ ప్రజల ఆత్మాభిమానానికి బీజేపీ ఖరీదు కడుతోందని ధ్వజమెత్తారు. అమిత్‌షా అబద్ధాలకు బాద్‌షా అని… ఆయన ప్రసంగంలో అధికార కాంక్ష తప్ప…. ప్రజల ఆకాంక్షలు, ప్రయోజనాలు లేవని కేటీఆర్ అన్నారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.
మునుగోడు ప్రజల స్వాభిమానం ముందు బీజేపీ ఓడిపోవడం ఖాయమని కేటీఆర్ అన్నారు. అమిత్‌షాతో మునుగోడు ప్రజలకు పావలా ప్రయోజం ఉండదని చెప్పారు. నల్ల చట్టాలతో అన్నదాతల ఉసురు తీద్దామనుకున్న బీజేపీ నేతలు.. రైతుల పక్షపాతి అయిన కేసీఆర్‌ను విమర్శించడాన్ని చూసి హిపోక్రసీ కూడా ఆత్మహత్య చేసుకుటుందని విమర్శించారు.
KTR Criticized Amit Shah : అమిత్‌షా తెలంగాణ పర్యటనపై మంత్రి కేటీఆర్ విమర్శలు
ఇక తెలంగాణ సీఎం కేసీఆర్‌ను రైతు వ్యతిరేకని అమిత్‌షా విమర్శించడం…. జోక్ ఆఫ్ ద సెంచరీ అని కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని కేంద్రం కాపీ కొట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ పథకాన్నే సీఎం కిసాన్ పేరుతో కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారీ ఉద్యమం జరిగిందని..సుమారు 700మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. రైతుల ఆగ్రహానికి గురైన ప్రధాని మోదీ.. ఆ తర్వాత వారికి క్షమాపణలు చెప్పింది నిజం కాదా అని ప్రశ్నించారు.