Minister KTR : తెలంగాణలో నేతన్నలను పట్టించుకోని కేంద్రం : మంత్రి కేటీఆర్

ఈసారైనా చేనేతల సమస్యలను కేంద్రం పట్టించుకోవాలని కోరారు. పీఎం మిత్ర పథకం కింద రూ.897.92 కోట్లు మంజూరు చేయాలని.. చాలాసార్లు కేంద్ర మంత్రులకు లేఖలు రాశామని గుర్తు చేశారు.

Ktr

Minister KTR angry with union government : కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోని నేతన్నలను కేంద్రం పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సిరిసిల్లలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్ లో నేతన్నలకు నిధులు కేటాయించలేదని విమర్శించారు. ఫిబ్రవరి 1న కేంద్రం మరోసారి బడ్జెట్ ను పెట్టనుందని తెలిపారు.

ఈసారైనా చేనేతల సమస్యలను కేంద్రం పట్టించుకోవాలని కోరారు. పీఎం మిత్ర పథకం కింద రూ.897.92 కోట్లు మంజూరు చేయాలని.. చాలాసార్లు కేంద్ర మంత్రులకు లేఖలు రాశామని గుర్తు చేశారు. చేనేత క్లస్టర్లు మంజూరు చేయాలని కోరామని తెలిపారు. నేషనల్ టెక్స్ టైల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ మంజూరు చేయాలని కోరినట్లు వెల్లడించారు.

AP Govt Employees Strike: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె సైరన్

సిరిసిల్ల నియోజకవర్గంలో మెగా లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ విమర్శలు మాని మెగా పవర్ లూమ్ క్లస్టర్ కోసం కృష్టి చేయాలని సూచించారు. ఓపిక నశిస్తే పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.