Fish Canteens: హైదరాబాద్ ‘ఫిష్ క్యాంటీన్లు’ సూపర్ సక్సెస్.. ఇక ప్రతీ జిల్లాలో.. మంత్రి వాకిటి శ్రీహరి కీలక ప్రకటన
'ఫిష్ క్యాంటీన్ల(Fish Canteens)' సేవలను త్వరలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకూ విస్తరించనున్నట్లు తెలంగాణ మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు.
- V Santhosh Kumar
- Published on- August 1, 2026 / 07:10 PM IST
Telangana minister vakiti srihari comments to expand fish canteens to all districts
- తెలంగాణలో ఫిష్ క్యాంటీన్ల విస్తరణ
- జిల్లాల్లో నాణ్యమైన ఆహార సేవలు
- మత్స్యకారులకు ఆర్థిక భరోసా
Fish Canteens: మాంసాహర ప్రియులకు, ముఖ్యంగా చేపల వంటకాలను ఇష్టపడే తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాజధాని నగరానికే పరిమితమైన ‘ఫిష్ క్యాంటీన్ల’ సేవలను త్వరలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకూ విస్తరించనున్నట్లు తెలంగాణ మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లోని ఫిష్ క్యాంటీన్‌ను క్షేత్రస్థాయిలో సందర్శించి, అక్కడ అందుతున్న సేవలు, భోజన నాణ్యతను స్వయంగా పరిశీలించారు.
నాణ్యత, పరిశుభ్రతకే ప్రథమ ప్రాధాన్యం:
ఈ సందర్శన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని ఫిష్ క్యాంటీన్(Fish Canteens)కు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. ఇదే తరహాలో క్యాంటీన్‌ను ఆధునిక సాంకేతికత, మౌలిక వసతులతో మరింత అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. వినియోగదారులకు ఎల్లప్పుడూ తాజా, అత్యంత నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని, పరిశుభ్రతకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి స్పష్టం చేశారు.
మత్స్యకారులకు ఆర్థిక భరోసా:
హైదరాబాద్ ప్రజల నుంచి వచ్చిన సానుకూల స్పందనను దృష్టిలో ఉంచుకుని, త్వరలోనే అన్ని జిల్లాల్లోనూ ఫిష్ క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు శ్రీహరి తెలిపారు. ఈ నిర్ణయం వల్ల ప్రజలకు సవకైన ధరకే నాణ్యమైన చేపల వంటకాలు దక్కడమే కాకుండా, స్థానికంగా ఉండే మత్స్యకారుల ఆదాయం పెరిగి వారికి ఆర్థిక భరోసా లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
