Durgam Chinnaiah: జూబ్లీహిల్స్‌లో రోడ్డుపక్కన అపస్మారక స్థితిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు

అందులో నిద్రమాత్రలు, ఓ లేఖ లభ్యమయ్యాయి. చిన్నయ్య వేధింపులకు గురి చేశారన్న ఆరోపణలపై..

MLA Durgam Chinnaiah

Durgam Chinnaiah – BRS: తెలంగాణలోని బెల్లంపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా వేధించారని ఆరోపణలు చేస్తోన్న యువతి ఇవాళ హైదరాబాద్‌(Hyderabad)లోని జూబ్లీహిల్స్(Jubilee Hills) పెద్దమ్మ గుడి దగ్గర అపస్మారక స్థితిలో కనపడ్డారు. ఆమెను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు బాధిత యువతిని ఆటోలో ఆసుపత్రికి తరలించారు. ఆమె బ్యాగును పరిశీలించారు. అందులో నిద్రమాత్రలు, ఓ లేఖ లభ్యమయ్యాయి. తనను వేధింపులకు గురిచేసిన చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని లేఖలో ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే తాను జాతీయ మహిళా కమిషన్ కు కూడా ఫిర్యాదు చేశానని అందులో గుర్తుచేశారు.

చిన్నయ్య వేధింపులకు గురి చేశారన్న ఆరోపణలపై ఆధారాలు లేవని ఢిల్లీలో తనతో ఓ ఎంపీ అన్నారని చెప్పారు. న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని పేర్కొన్నారు. తనను ఎప్పుడు హత్య చేస్తారోనంటూ క్షణక్షణం భయపడుతున్నారని లేఖలో చెప్పారు. పెద్దమ్మ గుడి వద్ద ఆమె నిద్రమాత్రలు మింగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

కాగా, దుర్గం చిన్నయ్య అవినీతి, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాధిత యువతి కొన్ని వారాలుగా చెబుతున్న విషయం తెలిసిందే. దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని ఢిల్లీ వేదికగానూ ఆమె కొన్ని వారాలపాటు పోరాటం చేశారు. పోలీసులకు ఆయన డబ్బులు ఇచ్చి వారిని చిన్నయ్య మేనేజ్ చేస్తున్నారని ఆ యువతి ఆరోపించారు. తెలంగాణ పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదని చెప్పారు. తనకు ప్రాణ హాని ఉందని ఆమె పలుసార్లు తెలిపారు.

France: ఫ్రాన్స్‌లో భారీగా చెలరేగుతున్న ఆందోళనలు.. కనపడిన వాటిని తగులబెడుతున్న నిరసనకారులు.. ఎందుకంటే?