Telangana Muncipal Elections Results : కవిత సంచలనం.. పార్టీ పెట్టకముందే మున్సిపాలిటీ కైవసం.. ‘సొంతంగా’ తొలి గెలుపు..
Telangana Muncipal Elections Results : జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని వడ్డేపల్లి మున్సిపాలిటీని కవిత పార్టీ అయిన తెలంగాణ జాగృతి పార్టీ కైవసం చేసుకుంది.
- Harishth Thanniru
- Published On : February 13, 2026 / 12:03 PM IST
telangana jagruthi party
Telangana Muncipal Elections Results : తెలంగాణలోని మున్సిపాలిటీ ఫలితాల్లో సంచలనం చోటు చేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని వడ్డేపల్లి మున్సిపాలిటీని కవిత పార్టీ అయిన తెలంగాణ జాగృతి పార్టీ కైవసం చేసుకుంది. తెలంగాణ జాగృతి పార్టీ అభ్యర్థులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింబల్ పై పోటీ చేసిన విషయం తెలిసిందే. జాగృతి పార్టీ నేత వాడేపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆ పార్టీ అభ్యర్థులు ఎనిమి స్థానాల్లో ఫార్వర్డ్ బ్లాక్ సింబల్‌తో పోటీ చేసి విజయం సాధించారు. మున్సిపాలిటీలో మొత్తం 10 వార్డులు ఉండగా.. కవిత జాగృతి పార్టీ అభ్యర్థులు ఎనిమిది స్థానాల్లో, కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు చెరో వార్డులో విజయం సాధించారు.
