CM Revanth Reddy : దశాబ్దకాలంగా దగా పడ్డ తెలంగాణ అభివృద్ధికి సేవకులుగా పని చేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో దశాబ్ద కాలంగా ప్రజాస్వామ్యం హత్యకు గురైందని రేవంత్ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అంత ఆషామాషీగా ఏర్పడలేదని..కాంగ్రెస్ పార్టీ నేతలు..కార్యకర్తలు సమిష్టి కృషితో ప్రభుత్వం ఏర్పడిందన్నారు.

CM Revanth reddy

Telangana New CM Revanth Reddy : ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. పోరాటాలతో, త్యాగాల పునాదులపై ఏర్పడిన రాష్ట్రంలో నాలుగు కోట్ల ప్రజలకు స్వేచ్చనివ్వాలని, సామాజిక న్యాయం చేయాలని, ప్రజలందరికి సమానమైన అభివృద్ధి అందించాలనే ఆకాంక్షతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని అన్నారు.  తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీ ఆశీస్సులతో కాంగ్రెస్ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు.

కానీ.. తెలంగాణలో దశాబ్ద కాలంగా ప్రజాస్వామ్యం హత్యకు గురైందని రేవంత్ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అంత ఆషామాషీగా ఏర్పడలేదని..కాంగ్రెస్ పార్టీ నేతలు..కార్యకర్తలు సమిష్టి కృషితో ప్రభుత్వం ఏర్పడిందన్నారు. తాను సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా సీఎంగా మీకు మాట ఇస్తున్నానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.  ప్రగతి భవన్ చుట్టు ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టి.. ‘నా తెలంగాణ కుటుంబం ఎప్పుడు ఏ సమస్యతో వచ్చినా..ప్రజా భవన్ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి’ అన్నారు. మీ సమస్యలను నిరభ్యంతరంగా ప్రభుత్వంతో చెప్పుకునే పాలన ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములన్నారు. ప్రభుత్వంలో ప్రజల ఆలోచనలు ఉంటాయని దానికి అనుగుణంగా పాలన ఉంటుందని హామీ ఇచ్చారు. తెలంగాణాను సంక్షేమ రాష్ట్రంగా..తీర్చిదిద్దేలా కృషి చేస్తానని మీ రేవంత్ అన్నగా మాట ఇస్తున్నానని అన్నారు.

ఈ వేదిక నుంచి మీకు మాట ఇస్తున్నా..ప్రగతి భవన్ లో రేపు ఉదయం 10గంటలకు జ్యోతిరావు పూలే ప్రజాభవన్ లో ప్రజా దర్భార్ నిర్వహిస్తామని సీఎం రేవంత్ తెలిపారు. తెలంగాణ ప్రజల హక్కులను కాపాడేందుకు ప్రజా భవన్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో నిస్సహాయులకు ఎవ్వరు లేరనే భావన లేకుండా వారికి అండగా ప్రభుత్వం ఉంటుందన్నారు. మీ సోదరుడిగా.. మీ బిడ్డగా మాట ఇస్తున్నా.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎప్పుడు నిలబడి ఉంటామని..తాము పాలకులం కాదు సేవకులం అని ..మీకు సేవల చేసేందుకు మాకు ఇచ్చి అవకాశంగా భావిస్తున్నామన్నారు. మీకు మాకు ఇచ్చిన అవకాశాన్ని అధికారంగా కాకుండా బాధ్యతగా భావిస్తామని హామీ ఇచ్చారు.

ట్రెండింగ్ వార్తలు