Telangana engineering colleges: తెలంగాణలో ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఫీజులు ఖరారు.. ఎంజీఐటీలో రూ.1.60 లక్షలు

తెలంగాణలో ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఫీజులు ఖరారయ్యాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఇవాళ జీవో జారీ చేసి, వివరాలు తెలిపింది. ఫీజుల పెంపునకు సంబంధించిన నివేదికను తెలంగాణ అడ్మిషన్స్‌ అండ్‌ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ) కొన్ని రోజుల క్రితమే సర్కారుకు సమర్పించింది. దాన్ని పరిశీలించి తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఏఎఫ్‌ఆర్సీ సిఫార్సుల మేరకు తెలంగాణలోని 159 కాలేజీల్లో ఫీజులను నిర్ణయించింది.

Telangana engineering colleges: తెలంగాణలో ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఫీజులు ఖరారయ్యాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఇవాళ జీవో జారీ చేసి, వివరాలు తెలిపింది. ఫీజుల పెంపునకు సంబంధించిన నివేదికను తెలంగాణ అడ్మిషన్స్‌ అండ్‌ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ) కొన్ని రోజుల క్రితమే సర్కారుకు సమర్పించింది. దాన్ని పరిశీలించి తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఏఎఫ్‌ఆర్సీ సిఫార్సుల మేరకు తెలంగాణలోని 159 కాలేజీల్లో ఫీజులను నిర్ణయించింది.

ఆయా కాలేజీల్లో కనీస రుసుమును రూ.45 వేలకు పెంచింది. తెలంగాణ వ్యాప్తంగా 40 కాలేజీల్లో ఫీజు లక్ష రూపాయలకు మించి ఉంది. ఎంజీఐటీలో రూ.1.60 లక్షలుగా, సీవీఆర్‌ కాలేజీలో 1.50 లక్షలుగా ఫీజు ఉంది. ఇక సీబీఐటీ, వాసవీ కాలేజీల్లో రూ.1.40 లక్షలుగా ఫీజులు ఉన్నాయి. మూడేళ్ల పాటు ఈ ఫీజులు అమల్లో ఉంటాయి. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పెంపుపై వివరాలు తెలియరాలేదు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..