Tg Employees
Telangana Govt Employees Transfers : తెలంగాణ రాష్ట్రంలో కొత్త జోనల్ విధానం ప్రకారం…ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2021, డిసెంబర్ 24వ తేదీ శుక్రవారం మార్గదర్శకాలు జారీ చేసింది. జిల్లా స్థాయి పోస్టులు, జోనల్ మల్టీ జోనల్ పోస్టులకు విడివిడిగా మార్గదర్శకాలిచ్చింది. కొత్త స్థానికత ఆధారంగా సీనియార్టీ జాబితా రూపొందించింది…ఉద్యోగుల నుంచి ఆఫ్షన్లు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది.
Read More : Coffee made in Cooker: ప్రెజర్ కుక్కర్లో “కాఫీ” తయారు: ఈయన “ఐడియా అదుర్స్” గురూ
కలెక్టర్, జిల్లా శాఖాధిపతులతో బదిలీల కోసం కమిటీ ఏర్పాటు చేసింది. బదిలీలు, పోస్టింగ్ తర్వాత..విధుల్లో చేరేందుకు మూడు రోజుల గడువునిచ్చింది. పోలీస్ – ఎక్సైజ్, స్టాంపులు, వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ శాఖలు అవసరమైతే విడిగా మార్గదర్శకాలు జారీ చేయవచ్చని పేర్కొంది. రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్ ల ప్రక్రియ వారం రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.
Read More : Tollywood Films : తెలంగాణలో సినిమా టికెట్ ధరలు పెరిగాయి..ఎంతంటే
కొత్త జోనల్ విధానంలో బదిలీలు పూర్తయి పోస్టింగ్ లో చేరిన తర్వాత అప్పీళ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. కొత్తగా కేటాయించిన పోస్టులో చేరిన తర్వాతే..అప్పీళ్లను స్వీకరించనుంది. అప్పీళ్లనింటిపైనా ప్రభుత్వం విచారణ జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకోనుంది. పోస్టింగ్స్ పూర్తయిన తర్వాత…అన్ని డిపార్ట్ మెంట్స్ లలో ఎన్ని ఖాళీలున్నాయో తెలుస్తుందని తదనంతరం జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని సమాచారం.