హైదరాబాద్‌లో రేషన్ కార్డు దరఖాస్తుదారులకు బిగ్ అలర్ట్.. కొత్త కార్డులు ఇచ్చేది ఆరోజే.. ఆలస్యంకు కారణాలు ఇవే..

హైదరాబాద్ మహానగరంలో నియోజకవర్గాల వారీగా కొత్త రేషన్ కార్డుల పంపిణీకి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం వెరిఫికేషన్ పనుల్లో ...

Telangana New Ration Card

Hyderabad: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అర్హులైన వారికి కొత్త కార్డులను అధికారులు అందజేస్తున్నారు. అయితే, హైదరాబాద్ నగరంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీపై సందిగ్ధత నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కార్డులు అందిస్తున్నా.. హైదరాబాద్ లో మాత్రం ఆ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. అయితే, సివిల్ సప్లయ్ అధికారులు హైదరాబాద్ లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఎప్పుడనే విషయంపై క్లారిటీ ఇచ్చారు.

హైదరాబాద్ మహానగరంలో నియోజకవర్గాల వారీగా కొత్త రేషన్ కార్డుల పంపిణీకి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం వెరిఫికేషన్ పనుల్లో అధికారులు బిజీగా ఉండటం, సర్కిళ్ల వారీగా అర్హుల జాబితా తయారు చేయడంలో కొనసాగుతున్న ఆలస్యం, వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా నగరంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ఆలస్యమవుతుందని తెలుస్తోంది.

అయితే, మరో మూడు, నాలుగు రోజుల్లో కొత్త కార్డుల పంపిణీ ప్రక్రియను చేపట్టి.. వచ్చేనెల 15వ తేదీలోపు పూర్తి చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే, మొదటి విడతలో 28,280 కార్డులు పంపిణీకి సిద్ధం చేశామని చెప్తున్నారు. కొత్తగా కార్డులు అందుకున్న వారికి సెప్టెంబర్ నెల నుంచి రేషన్ ను పంపిణీ చేస్తారు.

ఇటీవల కలెక్టరేట్ లో జిల్లా అధికారులతో ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కొత్త రేషన్ కార్డుల పంపిణీ విషయంపై సమావేశం నిర్వహించారు. కార్డుల పంపిణీలో ఆలస్యానికి కారణాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు కొత్త దరఖాస్తుల వెరిఫికేషన్ ను స్పీడప్ చేసి కార్డులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

నగరంలో తొమ్మిది సర్కిళ్ల పరిధిలో 28,280 కార్డులు పంపిణీకి సిద్ధం చేశారు. శుక్రవారమే వీటి పంపిణీ కార్యక్రమం మొదలవ్వాల్సి ఉంది.. అయితే, మరోసారి వాయిదా పడింది. వచ్చే వారం నుంచి కొత్త కార్డుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పదిహేను రోజుల్లోపు ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని చెబుతున్నారు.

ఇదిలాఉంటే.. మీకు రేషన్ కార్డు మంజూరైందా లేదా అనే స్థితిని తెలుసుకోవడానికి, మీరు భారత ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ https://epds.telangana.gov.in/FoodSecurityAct/ ను సందర్శించాలని అధికారులు సూచించారు. ఈ వెబ్‌సైట్‌లో మీ దరఖాస్తు స్థితిని.. కార్డు వివరాలను తనిఖీ చేసుకోవచ్చు. లేదా సమీప రేషన్ షాపులో కూడా ఆధార్ నంబర్‌తో మీకు కార్డు మంజూరైందా లేదా అనే వివరాలను తెలుసుకోవచ్చు.