Telangana Secretariat: నూతన సచివాలయం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు..

ఏప్రిల్ 30న నూతన సచివాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ అధికారులకు కీలక సూచనలు చేశారు. సచివాలయం ప్రారంభం రోజు ఏఏ కార్యక్రమాలు చేపట్టాలి, ఎవరెవరిని ఆహ్వానించాలనే విషయాలపై అధికారులకు సీఎం సూచించారు. అయితే, ప్రారంభోత్సవానికి ముహూర్తం సమయంపై క్లారిటీ రాలేదు.

Telangana New Secretariat

Telangana Secretariat: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం నూతన భవనం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 30న నూతన సచివాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ అధికారులకు కీలక సూచనలు చేశారు. సచివాలయం ప్రారంభం రోజు ఏఏ కార్యక్రమాలు చేపట్టాలి, ఎవరెవరిని ఆహ్వానించాలనే విషయాలపై అధికారులకు సీఎం సూచించారు. అయితే, ప్రారంభోత్సవానికి ముహూర్తం సమయంపై క్లారిటీ రాలేదు. త్వరలో పండితుల సూచనలతో ముహూర్తం సమయాన్ని వెల్లడించనున్నారు. సచివాలయం ప్రారంభం కాగానే తొలుత సీఎం కేసీఆర్ తన ఛాంబర్‌లో ఆసీనులవుతారు. ఆ తరువాతనే మంత్రులు, కార్యదర్శులు, సీఎంవో, సచివాలయ సిబ్బంది తమ ఛాంబర్లలో కూర్చోనున్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బందితో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, అన్ని శాఖల హెచ్ ఓడీలు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా పరిషత్, డీసీసీబీ, డీసీఎంఎస్, జిల్లా గ్రంథాలయాల చైర్మన్లు, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు, మేయర్లు ఇలా మొత్తం సుమారు 2500 మంది ఆహ్వానితులుగా ఉంటారు.

Telangana Secretariat: తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు

నూతన సచివాలయంకు నాలుగు దిక్కుల్లో ప్రధాన ద్వారాలున్నాయి. అయితే, ముఖ్యమంత్రి, సీఎస్, డీజీపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, చైర్మన్లు, ముఖ్యమైన ఆహ్వానితులు, ప్రముఖులు తూర్పు మెయిన్ గేటు ద్వారా రాకపోకలు సాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నూతన సచివాలయం సందర్శనకు అవకాశం ఉంటుంది. అయితే, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. సందర్శకులు వచ్చేందుకు ఆగ్నేయం (సౌత్ ఈస్ట్) వైపు గేటును ఉపయోగిస్తారు. సచివాలయం సిబ్బంది, కార్యదర్శులు, అధికారులు రాకపోకలు సాగించేందుకు మాత్రం ఈశాన్యం (నార్త్ ఈస్ట్) ద్వారంను వినియోగించనున్నారు. ఇక వాయువ్య (నార్త్ వెస్ట్) ద్వారాన్ని మాత్రం అవసరాలను బట్టి వినియోగిస్తారు.

Telangana Secretariat: తెలంగాణ నూతన సచివాలయం డ్రోన్ వీడియో .. సాగర తీరాన అద్భుత కట్టడం ..

సచివాలయం వద్ద పటిష్ఠ బందోబస్తు ఉంటుంది. ఈ మేరకు విధివిధానాలు రూపొందించి పకడ్బంధీ చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ డీజీపీని ఆదేశించారు. అత్యాధునిక పద్దతుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న నూతన సచివాలయ నిర్మాణం పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ సచివాలయ భవనాన్ని సీఎం కేసీఆర్ పుట్టిన రోజు అయిన ఫిబ్రవరి 17న ప్రారంభించేందుకు తొలుత ముహూర్తం ఖరారు చేశారు. అయితే, ఆ సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసుకున్నారు. గతంలో నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి పలు రాష్ట్రాల సీఎంలతో పాటు దేశంలోని పలువురు ప్రముఖులను ఆహ్వానించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అయితే, ఏప్రిల్ 30న జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి వారికి ఆహ్వానం ఉంటుందా, లేదా అనేది తెలియాల్సి ఉంది.