×
Ad

Telangana : తెలంగాణలో కరోనా..24 గంటల్లో 4 వేల 723 కేసులు

గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 4 వేల 723 కొత్త కరోనా కేసుు నమోదయ్యాయని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

  • Published On : May 12, 2021 / 10:05 PM IST

Tg Corona

Corona Positive Cases : తెలంగాణలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్నాయా ? అంటే..ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే..అవుననే అనిపిస్తోంది. రోజుకు 4 నుంచి 5 వేలకు దగ్గరలో పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 4 వేల 723 కొత్త కరోనా కేసుు నమోదయ్యాయని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 69,525 శాంపిళ్లను పరీక్షించారు. ఒక్కరోజులోనే 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాలు 2,834కు చేరాయి. ఇంకా 59,133 యాక్టివ్‌ కేసులున్నాయి. 5 వేల 695 మంది కరోనా వైరస్ నుంచి బయటపడ్డారు. మొత్తం పాజిటివ్ కేసులు 5 లక్షల 11 వేల 711 వరకు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా వైరస్ నుంచి 4,49,744 మంది కోలుకున్నారు.