Telangana : అనవసరంగా రోడ్ల మీదకు వచ్చారా..తాట తీస్తారు

ఇకపై అనవసరంగా రోడ్లపైకి వస్తే తాట తీస్తామంటున్నారు తెలంగాణ పోలీసులు. లాక్‌డౌన్‌ ఆంక్షలు మరింత కఠినతరం చేయాలని పోలీస్‌ బాస్‌ నుంచి ఆదేశాలు రావడంతో.. రూల్స్ స్ట్రిక్ట్‌గా ఫాలో అయ్యేందుకు రెడీ అవుతున్నారు పోలీసులు. మరి తెలంగాణ డీజీపీ ఇచ్చిన ఆదేశాలేంటి..? తెలంగాణలో మరింత కఠినంగా లాక్‌డౌన్‌ అమలుకానుంది.

Lockdown Violations : ఇకపై అనవసరంగా రోడ్లపైకి వస్తే తాట తీస్తామంటున్నారు తెలంగాణ పోలీసులు. లాక్‌డౌన్‌ ఆంక్షలు మరింత కఠినతరం చేయాలని పోలీస్‌ బాస్‌ నుంచి ఆదేశాలు రావడంతో.. రూల్స్ స్ట్రిక్ట్‌గా ఫాలో అయ్యేందుకు రెడీ అవుతున్నారు పోలీసులు. మరి తెలంగాణ డీజీపీ ఇచ్చిన ఆదేశాలేంటి..? తెలంగాణలో మరింత కఠినంగా లాక్‌డౌన్‌ అమలుకానుంది.

ఈనెల 30 వరకు విధించిన ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయాలంటూ.. అధికారులను ఆదేశించారు తెలంగాణ పోలీస్‌ బాస్‌. లాక్‌డౌన్‌ అమలుపై జోనల్ ఐజీలు, డీఐజీలు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి.. కీలక ఆదేశాలిచ్చారు. మే 30 తరవాత.. ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి లాక్‌డౌన్‌ పొడిగించేందుకు వీల్లేకుండా ప్రస్తుతం అమలవుతున్న లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలన్నారాయన. ఉదయం 10 గంటల తర్వాత అకారణంగా బయటకు వచ్చే వాహనాలను సీజ్‌ చేయాలని ఆదేశించారు. ప్రతిరోజు లాక్‌డౌన్‌ మినహాయింపు గడువు ముగియగానే… పెట్రోలింగ్‌ వాహనాలు సైరన్‌ వేసి సంచరించాలన్నారు ఆదేశాలిచ్చారు డీజీపీ.

లాక్‌డౌన్‌ ఉల్లంఘనలపై పోలీస్‌లు సీరియస్‌ యాక్షన్‌ తీసుకోవాలన్నారు డీజీపీ మహేందర్‌ రెడ్డి. రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలు తీరును ప్రతిరోజు జిల్లాల వారీగా సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నారని.. పోలీస్‌ కమిషనర్‌, ఎస్పీ,డీఎస్పీ, డీసీపీ, ఏసీపీ స్థాయి ఉన్నతాధికారులంతా కచ్చితంగా క్షేత్రస్థాయిలో ఉండి పర్యవేక్షించాలని చెప్పారాయన. ఉదయం 6 గంటల నుంచి 10 గంట‌ల వరకు లాక్‌డౌన్‌ సడలింపు ఉన్నప్పటికీ.. 8 గంట‌ల‌ తర్వాతే ప్రజలు నిత్యావసరాలకు వస్తున్నారన్నారు డీజీపీ. మార్కెట్లు, దుకాణాల దగ్గర పెద్దఎత్తున ప్రజలు గుమికూడటం కనిపిస్తోందని.. దీనిని నివారించేందుకు ఉదయం 6 గంట‌ల‌ నుంచే తమ అవసరాల కోసం వెళ్లేలా ప్రజలను చైతన్యపరచాలని సూచించారు.

మరోవైపు లాక్‌డౌన్ నుంచి పెట్రోల్ బంకుల‌కు తెలంగాణ సర్కార్‌ మిన‌హాయింపునిచ్చింది. గ్రామాలు, ప‌ట్టణాల్లో పెట్రోల్ బంకులు తెరిచేందుకు అనుమ‌తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. సాగు అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ధాన్యం సేక‌ర‌ణ‌, అవ‌స‌రాల కోసం వినియోగించే వాహ‌నాల‌కు మిన‌హాయింపు ఇచ్చారు. హైవేల‌పై పెట్రోల్ బంకుల‌కు ఇప్పటికే మిన‌హాయింపు ఉండ‌గా.. తాజాగా గ్రామాలు, ప‌ట్టణాల్లో ఉండే బంకుల‌ను కూడా తెరుచుకోనున్నాయి.

Read More : Operation Muskaan : చదువుకుని సీఎం అవుతా…. ఆపరేషన్ ముస్కాన్

 

ట్రెండింగ్ వార్తలు