Operation Muskaan : చదువుకుని సీఎం అవుతా…. ఆపరేషన్ ముస్కాన్

వీధి బాలలను తల్లిదండ్రులకు అప్పగించేందుకు నిర్వహించిన ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమంలో ఓ బాలిక.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్ఫూర్తితో సీఎంను అవుతానని పోలీసులతో చెప్పింది.

Operation Muskaan : చదువుకుని సీఎం అవుతా…. ఆపరేషన్ ముస్కాన్

Operation Muskaan Drive And Rescuing Children During Covid 19

Operation Muskaan drive :  వీధి బాలలను తల్లిదండ్రులకు అప్పగించేందుకు నిర్వహించిన ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమంలో ఓ బాలిక.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్ఫూర్తితో సీఎంను అవుతానని పోలీసులతో చెప్పింది. తిరుపతి అర్బన్‌ పోలీసులు బుధవారం ఏఆర్‌ పరేడ్‌ పోలీస్‌ గ్రౌండ్‌లో అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పల నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

మూడో తరగతి చదువుతున్న అలకనంద(7) అనే బాలిక తల్లిదండ్రులు 8 నెలల కిందట హైదరాబాద్‌ నుంచి తిరుపతికి వలస వచ్చి బియ్యం వ్యాపారి వద్ద కూలి పనులు చేసుకుంటూ బాలాజీ లింక్‌ బస్టాండ్‌ వద్ద జీవనం సాగిస్తున్నారు.

తల్లిదండ్రులకు తోడుగా ఈ పాప కూడా పనిచేస్తోందని పోలీసులు తెలుసుకున్నారు. దాంతో అర్బన్‌ ఎస్పీ ఆ పాపను విచారిస్తూ పెద్దయ్యాక ఏం చేస్తావ్‌? అని అడిగితే ఆ చిన్నారి పైవిధంగా సమాధానం చెప్పింది.

ఆ తర్వాత మీడియా అడిగిన ప్రశ్నలకు చిన్నారి బదిలిస్తూ.. హైదరాబాద్‌లో చదువుకుంటే తమకు అమ్మ ఒడి రాదంది. ఏపీలో తన లాంటి చిన్నారులను ప్రోత్సహించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిసి ఇక్కడికి వచ్చినట్టు తెలిపింది.