Gram Panchayat Elections: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఫేజ్ 2 ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికలు 193 మండలాల్లో జరుగుతున్నాయి. మొత్తం 3,911 గ్రామ పంచాయతీలకు సర్పంచులను, అలాగే, 29,917 మంది వార్డు సభ్యులను ఎన్నుకుంటారు.
సర్పంచి పదవులకు 12,782 మంది పోటీపడుతుండగా, వార్డు మెంబర్‌కు 71,071 మంది పోటీలో ఉన్నారు. ఒక్కో సర్పంచ్ స్థానానికి సగటున 3-4 మంది పోటీలో నిలిచారు.వార్డు సభ్యస్థానాలకు సగటున ఇద్దరు, ముగ్గురు పోటీపడుతున్నారు.
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో గ్రామ పంచాయతీలు మొత్తం 4,333 నోటిఫై కాగా, 38,350 వార్డులు నోటిఫై అయ్యాయి. పోలింగ్ స్టేషన్లు 38,337, ఓటర్ల సంఖ్య 57,22,665గా ఉంది. వారిలో పురుషులు 27,96,006 మంది, మహిళలు 29,26,306 మంది ఉన్నారు. ఇతరులు 153 మంది ఉన్నారు.
పోలింగ్ సిబ్బంది 93,905 మంది విధుల్లో ఉన్నారు. మైక్రో ఆబ్జర్వర్లు 2,489 మంది మూడు దశల ఎన్నికలకు ఉంటారు. వెబ్‌కాస్టింగ్ కోసం గుర్తించిన పోలింగ్ స్టేషన్లు 3,769. అందుబాటులో ఉన్న బ్యాలెట్ బాక్సులు 46,026.
ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది. ఓటింగ్ పూర్తయ్యాక కౌంటింగ్ జరిపి, గెలిచిన వారి పేర్లను ప్రకటిస్తారు. ఇప్పటికే 415 సర్పంచ్ స్థానాలతో పాటు 8,307 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి.