TGSP Police : తెలంగాణ పోలీస్ శాఖ మరో సంచలన నిర్ణయం.. ఆ 10 మంది టీజీఎస్పీల డిస్మిస్!

TGSP Police : బెటాలియన్‌లో ఉద్యమం చేస్తున్న 10 మంది తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌ (టీజీఎస్పీ) కానిస్టేబుళ్లను సర్వీసు నుంచి తొలగిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.

Telangana police department dismissed

TGSP Police : తెలంగాణ పోలీసు శాఖ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల బెటాలియన్‌లో ఉద్యమంలో పాల్గొన్న 10 మంది తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌ (టీజీఎస్పీ) కానిస్టేబుళ్లను సర్వీసు నుంచి తొలగించారు. ఈ మేరకు ఏడీజీ సంజయ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

విధుల నుంచి తొలగించిన కానిస్టేబుళ్లలో ఆరో బెటాలియన్‌(భద్రాద్రి కొత్తగూడెం)కు చెందిన కానిస్టేబుల్‌ కె.భుషన్‌ రావుతో పాటు మూడో బెటాలియన్‌ (ఇబ్రహీంపట్నం)కు చెందిన కానిస్టేబుల్‌ రవికుమార్‌, 12వ బెటాలియన్‌ (అన్నెపర్తి)కి చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ రామకృష్ణ, 17వ బెటాలియన్‌ (సిరిసిల్లా)కు చెందిన ఏఆర్‌ఎస్సై సాయిరామ్‌, కానిస్టేబుల్‌ ఎస్‌కే షఫీ, ఇతర కానిస్టేబుళ్లు కరుణాకర్‌ రెడ్డి, వంశీ, అశోక్, శ్రీనివాస్‌, లక్ష్మీనారాయణ ఉన్నారు.

ఇటీవలే ఒకే రాష్ట్రం, ఒకే పోలీస్‌ విధానమంటూ పోలీస్‌ కానిస్టేబళ్లు పలు జిల్లాల్లో ఆందోళనకు దిగారు. పోలీసు కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు రోడ్లపై ధర్నాలు కూడా చేపట్టారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌ అయింది. ఆందోళనలో పాల్గొన్న వారిలో 39 మందిని సస్పెండ్‌ చేస్తూ పోలీసులు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అందులో 10 మందిని పూర్తిగా సర్వీసు నుంచి తొలగిస్తూ పోలీసు శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది.

Read Also : KTR : ఇంట్లో దావత్ చేసుకుంటే తప్పా.. చేతనైతే రాజకీయంగా తలపడండి.. : కేటీఆర్