Telangana Police Recruitment 2026 : తెలంగాణలోని నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 7వేల పోలీస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. ఫుల్ డీటెయిల్స్

Telangana Police Recruitment 2026 : నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్ శుభవార్త చెప్పింది. హోంశాఖలో ఏడు వేల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా.. ఐదు వేల పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసింది.

Telangana police notification 2026

  • నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త
  • హోంశాఖలో ఏడు వేల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
  • 5వేల పోలీస్ పోస్టులకు ఉత్తర్వులు జారీ
  • రెండుమూడు రోజుల్లో 2వేల పోస్టులకు మరో నోటిఫికేషన్

Telangana Police Recruitment 2026 : తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. హోంశాఖలో ఏడు వేల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో 5వేల పోలీస్ పోస్టులకు ఉత్తర్వులు జారీకాగా.. మిగిలిన రెండు వేల పోస్టుల భర్తీకి సంబంధించి జీవోలు త్వరలోనే విడుదల కానున్నాయి. తెలంగాణ పోలీస్‌ నియామక మండలి (TSLPRB) ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది.

Also Read : Rythu Bharosa 2026 : రైతులకు మరో శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్.. వారికి కూడా రైతుభరోసా నిధులు.. ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ..

తెలంగాణ హోంశాఖలోని పోలీస్, జైళ్లు, అగ్నిమాపకశాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్) కొలువుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దాదాపు ఏడు వేల పోస్టుల భర్తీకి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదముద్ర వేయగా.. ఇందులో ఐదు వేల పోలీస్ పోస్టుల భర్తీకి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఎస్పీఎఫ్, జైళ్లశాఖ, అగ్నిమాపక శాఖలకు సంబంధించి మరో రెండు వేల పోస్టులకోసం ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి. ఈ మేరకు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ కసరత్తు ప్రారంభించింది.

ప్రస్తుతం భర్తీ చేసేందుకు ఉత్తర్వులు జారీ అయిన 5వేల పోలీస్ పోస్టుల్లో .. సివిల్ ఎస్ఐ (148), ఏఆర్ ఎస్ఐ (14), టీజీఎస్పీ ఏఆర్ ఎస్ఐ (12), ఎస్ఏఆర్ సీపీఎల్ ఎస్ఐ (3), ఫింగర్ ప్రింట్ బ్యూరో ఏఎస్ఐ (23), సివిల్ కానిస్టేబుల్ (3,697), ఏఆర్ కానిస్టేబుల్ (1,052), ఎస్ఏఆర్ సీపీఎల్ కానిస్టేబుల్ (24), కానిస్టేబుల్ (డ్రైవర్) పీటీవో (20), కానిస్టేబుల్ (మెకానిక్) పీటీవో (7) పోస్టులు ఉన్నాయి.

ఇదిలాఉంటే.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారి 2015 సంవల్సరంలో 9,281 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఆ తరువాత 2018లో 1217 మంది ఎస్ఐ స్థాయి పోస్టులు, 16,285 మంది కానిస్టేబుళ్ల స్థాయి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మూడోసారి 2022లో 554 ఎస్ఐ స్థాయి పోస్టులతోపాటు 15,644 కానిస్టేబుల్ స్థాయి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. తాజాగా.. నాలుగో నోటిఫికేషన్‌లో 5వేల పోలీస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.