G Srinivasa Rao : తెలంగాణ హెల్త్ డైరెక్టర్‌‌కు కరోనా పాజిటివ్

తెలంగాణలో కోవిడ్ కల్లోలం సృష్టిస్తోంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ అంతా కోవిడ్ బారిన పడుతున్నారు. అధికారులను సైతం కరోనా మహమ్మారి కంగారు పెడుతోంది.

G Srinivasa Rao : దేశవ్యాప్తంగా మరోసారి కరోనావైరస్ మహమ్మారి కలకలం రేపుతోంది. రోజురోజుకి పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజువారీ కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి. తెలంగాణలోనూ కోవిడ్ కల్లోలం సృష్టిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అంతా కోవిడ్ బారిన పడుతున్నారు. రాజకీయ ప్రముఖులు, అధికారులను సైతం కరోనా మహమ్మారి కంగారు పెడుతోంది.

Covid New Guidelines: కొవిడ్ కొత్త మార్గదర్శకాలు.. ఆగకుండా దగ్గు వస్తే టీబీ పరీక్ష చేయించుకోండి

తాజాగా తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు కరోనా బారిన పడ్డారు. ఆయనకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. స్వల్పంగా కరోనా లక్షణలు కనిపించడంతో ఆయన టెస్ట్ చేయించుకున్నారు. రిజల్ట్ పాజిటివ్ గా వచ్చింది. దీంతో ఐసోలేషన్, చికిత్స కోసం ఆసుపత్రిలో చేరుతున్నట్టు హెల్త్ డైరెక్టర్ స్వయంగా తెలిపారు. ఏ విధమైన ఆందోళన, అపోహలు అవసరం లేదని, త్వరలోనే కరోనా నుంచి కోలుకుని పూర్తి ఆరోగ్యంతో ప్రజల ముందుకు వస్తానని శ్రీనివాసరావు చెప్పారు. కరోనా మహమ్మారి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని హెల్త్ డైరెక్టర్ సూచించారు. కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.

ట్రెండింగ్ వార్తలు