Ration Card Update : రేషన్ తీసుకోలేకపోయారా? మరో ఛాన్స్.. 3 నెలల బియ్యం గడువు పొడిగింపు!

Ration Card Update : రేషన్ కార్డుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 5 వరకు బియ్యం తీసుకునే అవకాశం అందిస్తోంది. 3 నెలల బియ్యాన్ని ఆగస్టు 31లో పొందలేని రేషన్ కార్డుదారులు ఈ నెలలో కూడా తీసుకోవచ్చు..

Telangana Ration Card Holders

  • తెలంగాణ రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ 5 వరకు ఛాన్స్
  • రేషన్ కార్డుపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. లబ్ధిదారులకు బిగ్ రిలీఫ్
  • ఇక క్యూలో నిలబడాల్సిన పనిలేదు.. మొబైల్‌తోనే రేషన్ ఇ-కేవైసీ

Ration Card Update : తెలంగాణ రేషన్ కార్డుదారులు ఎగిరిగంతేసే వార్త.. రేషన్ కార్డుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పౌరసరఫరాల శాఖ భారీ ఊరటనిచ్చింది. గడువు తేదీలోగా
ఒకేసారి 3 నెలలకు రేషన్ బియ్యం పొందలేని వారికి మరో ఛాన్స్..

ఆగస్టు 31తో ముగిసిన ఈ గడువును సెప్టెంబర్ 5వ తేదీ సాయంత్రం వరకు పొడిగించినట్లు తెలుస్తోంది. ముందుగా ఈ బియ్యం పంపిణీకి ఆగస్టు 31 చివరి తేదీ కాగా, వర్షాలు, పండుగల రద్దీ, లబ్ధిదారులు సొంతూళ్లకు వెళ్లడం వంటి కారణాలతో ఈ గడువును మరింత పెంచింది.

ఈసారి విడతలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలకు సంబంధించిన బియ్యం ఒకేసారి తీసుకోవచ్చు. గత ఆగస్టులో 3 నెలల బియ్యం పంపిణీ ప్రారంభం కాగా రద్దీ, ఇతర కారణాలతో రేషన్ తీసుకోలేకపోయారు. అర్హులైన కుటుంబాలకు ఈ పొడిగింపు చాలా రిలీఫ్. ఎలాగో పెంచారు కదా అని ఆలస్యం చేయొద్దు.. రేషన్ కార్డుదారులు లాస్ట్ డేట్ వరకు వేచి ఉండొద్దు. మీకు దగ్గరలోని రేషన్ డీలర్ వద్దకు వెళ్లి సరుకులు తీసుకోవడం బెటర్.

Read Also : Air Marshal Jeetendra Mishra : అయోధ్య రామ మందిర ఫస్ట్ CEO ఇతడే.. జితేంద్ర మిశ్రా ఎవరు? ఆయన ట్రాక్ రికార్డ్ ఇదే!

మొబైల్‌తో e-KYC ఎలా? :

రేషన్ కార్డు e-KYC ప్రాసెస్ కూడా ఇప్పుడు చాలా ఫాస్ట్ అవుతుంది. ఆధార్ ఆధారిత వెరిఫికేషన్ ద్వారా అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే బెనిఫిట్స్ అందేలా ఈ ప్రాసెస్ నడుస్తోంది. కానీ, ఇప్పటిరవకూ రేషన్ షాపులో e-POS మిషన్ ద్వారా ఫింగర్ ఫ్రింట్ కేవైసీ చేసుకునే వీలుంది. ఇకపై రద్దీ కారణంగా అక్కడ కేవైసీ పూర్తి చేయలేని వారికి మొబైల్ ఆధారిత ఫేస్ ఆథెంటికేషన్ అవకాశం ఉంటుంది.

ఫస్ట్ ఫేస్ వెరిఫికేషన్ ఇలా :

  • మీ ఫోన్‌లో ‘Mera eKYC’ యాప్‌ను ఓపెన్ చేయండి.
  • రాష్ట్రం (Telangana) పేరును ఎంచుకోండి.
  • రాష్ట్రం ఎంటర్ చేయండి. ఆపై Next ఆప్షన్ ఎంచుకోండి.
  • కుటుంబ సభ్యుని ఆధార్ నంబర్‌ను జాగ్రత్తగా ఎంటర్ చేయండి.
  • ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాక లింక్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది
  • 6 అంకెల ఓటీపీని యాప్‌లో ఎంటర్ చేయండి.
  • అక్కడి క్యాప్చా (Captcha) కోడ్‌ కూడా ఎంటర్ చేయండి.
  • ఆపై సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
  • ఫస్ట్ ఫేస్ వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్టే.

సెకండ్ ఫేస్ వెరిఫికేషన్ ప్రాసెస్ :
ముందుగా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో Mera eKYC, Aadhaar Face RD యాప్స్ తప్పనిసరి. మేరా ఇకేవైసీలో (Telangana)ను ఎంచుకోవాలి. కుటుంబ సభ్యుడి ఆధార్ వివరాలు కూడా ఎంటర్ చేసి OTP, క్యాప్చా వెరిఫికేషన్ పూర్తి చేయాలి. ఆ తర్వాత ఆధార్ ఫేస్ RD ద్వారా ఫేస్ అథెంటికేషన్ జరుగుతుంది.

సరైన వెలుతురులో మీ ఫేస్ కెమెరా ముందు ఉంచి సూచనలను పాటిస్తే చాలు.. మీ ఫేస్ అథెంటికేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది. ఈ ప్రాసెస్ టైంలో ఫేస్ వద్ద సర్కిల్ గ్రీన్ కలర్ మారినప్పుడు కనురెప్పలు బ్లింక్ చేయాలి. అప్పుడు యాప్ మీ ఫేస్ స్కాన్ అవుతుంది. ఆధార్ డేటాబేస్ ఫొటోతో మ్యాచ్ చేస్తుంది. ఈ ప్రాసెస్ పూర్తి అయితే రేషనల్ కార్డు ఈకేవైసీ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టే..

Note : యాప్‌లో వ్యక్తిగత ఆధార్ వివరాలు ఎంటర్ చేసే ముందు మీరు వాడేది అధికారిక యాప్‌ అవునో కాదో చెక్ చేసుకోండి. యాప్ వివరాలు, డెవలపర్‌ను తప్పనిసరిగా చెక్ చేయండి.