Telangana Ration Card : రేషన్ కార్డుదారులకు పండగే.. ఇక బియ్యంతో పాటు మరో 6 సరుకులు..? ఎప్పటినుంచంటే?

Telangana Ration Card : తెలంగాణ రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. బియ్యంతో పాటు గోధుమపిండి, కందిపప్పు, పామాయిల్ సహా మరో 6 సరుకులను సబ్సిడీ ధరలకు అందించే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ధరలు, పంపిణీ తేదీ వివరాలివే..

Telangana Ration Card

  • రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్..
  • తెలంగాణ రేషన్ షాపుల్లో కొత్తగా 6 సరుకులు..?
  • ఇక రేషన్‌తో గోధుమపిండి, కందిపప్పు, పామాయిల్ కూడా?

Telangana Ration Card : తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు త్వరలోనే తీపికబురు అందే అవకాశం ఉంది. ఇప్పటికే పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు ఊరట కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదనను పరిశీలిస్తోంది.

ఇప్పటివరకు రేషన్ దుకాణాల ద్వారా ప్రధానంగా బియ్యం పొందుతున్న లబ్ధిదారులకు.. ఇకపై మరో 6 నిత్యావసర సరుకులను కూడా (Telangana Ration Card) సబ్సిడీ ధరలకు అందించే యోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే, దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

రేషన్ షాపుల్లో అందించనున్న సరుకులివే.. :
ప్రతిపాదన ప్రకారం.. రేషన్ దుకాణాల ద్వారా గోధుమపిండి, కందిపప్పు, పామాయిల్, చక్కెర, చింతపండు, కారం పొడి పంపిణీ చేసే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సరుకులు తక్కువ ధరలకు అందుబాటులోకి వస్తే పేద, మధ్యతరగతి కుటుంబాలకు నెలవారీ కిరాణా ఖర్చులు కొంతవరకు తగ్గే అవకాశం ఉంది.

Read Also : AP Local Body Polls : ఏపీలో మున్సిపల్ ఎన్నికలపై ఉత్కంఠ.. ఈసీ ఏం చేయబోతోంది? సుప్రీంకోర్టు గడువుతో టెన్షన్..!

ధరలు ఎంత? పంపిణీ ఎప్పటినుంచి? :
ఈ 6 సరుకులను ఏ ధరలకు విక్రయించాలి? ఒక్కో రేషన్ కార్డుపై ఎంత సైజులో ఇవ్వాలి? పంపిణీ ఎప్పటినుంచి ప్రారంభించాలి? అనే అంశాలపై ఇంకా ఫైనల్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఈ ప్రతిపాదనపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు పేర్కొన్నారు. సరుకుల సేకరణ, నిల్వలు, రవాణా, పంపిణీతో పాటు ప్రభుత్వంపై పడే వార్షిక ఆర్థిక భారాన్ని అంచనా వేసి సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.

భారీగా బియ్యం నిల్వలు.. ఆహార భద్రతపై ఫోకస్ :
మరోవైపు రాష్ట్రంలో రేషన్ పంపిణీ, సంక్షేమ పథకాలు, పాఠశాలల మధ్యాహ్న భోజన పథకానికి అవసరమైన బియ్యం నిల్వలపైనా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ప్రజలకు ఆహార ధాన్యాల కొరత రాకుండా ముందస్తు ప్లాన్లు రెడీ చేయాలని అధికారులకు సూచించినట్లు వెల్లడిస్తోంది..

ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది :
బియ్యంతో పాటు మరో 6 సరుకుల పంపిణీ ప్రస్తుతం ప్రతిపాదన దశలోనే ఉంది. వాటి ధరలు, పరిమాణం, అమలు తేదీ, అర్హతలకు సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడైన తర్వాతే పూర్తి క్లారిటీ రానుంది. రేషన్ కార్డుదారులు ప్రభుత్వ ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే..