Covid-19 Updates : తెలంగాణలో కొత్తగా 156 కోవిడ్ కేసులు
తెలంగాణలో గత 24 గంటల్లో 156 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ వల్ల ఇద్దరు మరణించారు.
- chvmurthy
- Published On : November 3, 2021 / 08:47 PM IST
Ts Covid Updates
Covid-19 Updates : తెలంగాణలో గత 24 గంటల్లో 156 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ వల్ల ఇద్దరు మరణించారు. అదే సమయంలో 135 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొవిడ్ రికవరీ రేటు 98.82 శాతంగా ఉంది. మరణాల రేటు 0.58శాతంగా ఉందని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ఈరోజు విడుదల చేసిన తాజా బులెటిన్’లో పేర్కోంది.
Also Read : Petrol Diesel : దేశ ప్రజలకు దీపావళి గిఫ్ట్.. పెట్రోల్, డీజిల్ ధరలపై భారీ తగ్గింపు
తెలంగాణలో ఇప్పటివరకు 2,76,8,592కు పైగా శాంపిల్స్ పరీక్షించగా.. 6,71,946 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ బారిన పడినవారిలో 6,64,033 మంది కోలుకోగా.. 3,960 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,953 క్రియాశీల కేసులు ఉన్నాయి. జీహెచ్ ఎంసీ పరిధిలో కొత్తగా 53 కోవిడ్ కేసులు, రంగారెడ్డి జిల్లాలో 14, కరీంనగర్ జిల్లాల్లో12, మేడ్చల్ మల్కాజ్ గిరి 11, కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
