Corona (3)
Telangana corona cases : తెలంగాణలో కొత్తగా 2,387 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనా బారిన పడి ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 30,931 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు వైరస్ సోకి 4,097 మంది మరణించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 688 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
మరోవైపు దేశవ్యాప్తంగా నిన్న 1,49,394 కరోనా కేసులు నమోదు కాగా, 1,072 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశంలో 4,19,52,712కోవిడ్ కేసులు నమోదు కాగా, వీరిలో 5,00,055 మంది కరోనా తదితర కారణాలతో మరణించారు. ప్రస్తుతం దేశంలో 14,35,569 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటి రేటు 9.27 శాతానికి చేరుకుంది.
Ministers Committee : సమ్మెకు వెళ్లొద్దని కోరిన మంత్రుల కమిటీ.. ఉద్యోగుల ముందు కీలక ప్రతిపాదనలు
నిన్న కరోనా నుంచి 2,46,674 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారిసంఖ్య 4,00,17,088 కి చేరుకుంది. దేశంలో కరోన రికవరీ రేటు 95.39 శాతంగా ఉంది. భారత్‌లో ఇప్పటి వరకు 73,58,04,280 మందికి కరోన నిర్ధారణ పరీక్షలు చేశారు.
గడిచిన 24 గంటల్లో 16,11,666 కరోనా టెస్టులు చేశారు. దేశవ్యాప్తంగా 3,249 లాబ్స్ లో కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి.వీటిలో 1409 ప్రభుత్వ లాబ్స్,1840 ప్రైవేట్ లాబ్స్ ఉన్నాయని ఐసీఎంఆర్ తెలిపింది.