Corona in Telangana
TS Corona: తెలంగాణలో కరోనా ఉదృతి కొనసాగుతోంది. గత వారం రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతుండటం భయాందోళనలను గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2,606 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వరుసగా రెండు వేలకు పైగా కేసులు నమోదు కావడం ఇది రెండో రోజు. వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో వివరాల ప్రకారం 24 గంటల్లో 285 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన వాటితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,92,357కు చేరింది.
చదవండి : Telangana Covid Update : తెలంగాణలో ఈరోజు కొత్తగా 2,295 కొవిడ్ కేసులు
ఇందులో 6,76,136 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్ కారణంగా మొత్తం 4,041 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మరణాల రేటు 0.58శాతంగా ఉందని, రికవరీ రేటు 97.65 శాతంగా అధికారులు తెలిపారు. ప్రస్తుతం 12,180 యాక్టివ్ కేసులున్నాయనిహెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు. కొత్త కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 1,583 కేసులు రికార్డయ్యాయి.
చదవండి : Telangana Covid Update : తెలంగాణలో ఈరోజు కొత్తగా 2,295 కొవిడ్ కేసులు