తెలంగాణలో కొత్తగా 157 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 157 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 3,01,318కి చేరింది. ఒకరు కరోనాతో చనిపోయారు. ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 1,654కి చేరింది. నిన్న(మార్చి 14,2021) రాత్రి 8 గంటల వరకు 38వేల 517 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ సోమవారం(మార్చి 15,2021) ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కరోనా బారి నుంచి 166మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 2లక్షల 97వేల 681కి చేరింది.

Telangana Coronavirus Cases

telangana reports 157 coronavirus cases: తెలంగాణలో కొత్తగా 157 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 3,01,318కి చేరింది. ఒకరు కరోనాతో చనిపోయారు. ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 1,654కి చేరింది. నిన్న(మార్చి 14,2021) రాత్రి 8 గంటల వరకు 38వేల 517 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ సోమవారం(మార్చి 15,2021) ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కరోనా బారి నుంచి 166మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 2లక్షల 97వేల 681కి చేరింది.

రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,983 ఉండగా.. వీరిలో 718 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 35 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు 92లక్షల 38వేల 982కి కరోనా పరీక్షలు చేశారు.

26వేలు దాటాయి.. ఈ ఏడాది ఇదే అత్యధికం:
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తాజాగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 26వేల 291 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఈ ఏడాదిలో(2021) నమోదైన అత్యధిక కేసులివే. క్రితం రోజుతో పోలిస్తే 3.8శాతం కేసులు పెరగడం ఆందోళనకరం. గడిచిన 24 గంటల్లో మరో 118 మంది వైరస్‌కు బలయ్యారు. ఇప్పటివరకు లక్షా 58వేల 725 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపం:
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి విపరీతంగా ఉంది. కొన్నిరోజులుగా అక్కడ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం(మార్చి 14,2021) ఈ కేసుల సంఖ్య ఏకంగా 16వేలు దాటింది. నిన్న అక్కడ 16వేల 620 మంది వైరస్‌ బారిన పడగా.. 50 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా మొత్తం 2.19లక్షల యాక్టివ్‌ కేసులుండగా.. ఒక్క మహారాష్ట్రలోనే లక్షా 26వేల 231 యాక్టివ్ కేసులుండటం ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు విచ్చలవిడిగా పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. నాగ్‌పూర్‌ సహా కొన్ని జిల్లాల్లో మళ్లీ లాక్‌డౌన్‌ విధించింది.