×
Ad

Telangana Corona : 24 గంటల్లో 1798 కరోనా కేసులు..ఏ జిల్లాలో ఎన్ని అంటే

తెలంగాణలో కరోనా మెల్లిమెల్లిగా తగ్గుముఖం పడుతోంది. దీంతో లాక్ డౌన్ లో ప్రభుత్వం సడలింపులు ప్రకటిస్తోంది. గత 24 గంటల్లో 1798 కేసులు నమోదయ్యాయని, 14 మంది మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

  • Published On : June 10, 2021 / 07:19 PM IST

Tg Corona

COVID 19 In Telangana : తెలంగాణలో కరోనా మెల్లిమెల్లిగా తగ్గుముఖం పడుతోంది. దీంతో లాక్ డౌన్ లో ప్రభుత్వం సడలింపులు ప్రకటిస్తోంది. గత 24 గంటల్లో 1798 కేసులు నమోదయ్యాయని, 14 మంది మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 3 వేల 440గా ఉంది. తాజాగా..2524 మంది కోలుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 5 లక్షల 71 వేల 610గా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 23 వేల 561 యాక్టివ్ కేసులుండగా…జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 177 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. గృహ/సంస్థల ఐసోలేషన్ గల వ్యక్తుల సంఖ్య 23 వేల 561 గా ఉంది.

ఏ జిల్లాలో ఎన్ని కేసులు : –

ఆదిలాబాద్ 06. భద్రాద్రి కొత్తగూడెం 86. జీహెచ్ఎంసీ 174. జగిత్యాల 39. జనగామ 15. జయశంకర్ భూపాలపల్లి 40. జోగులాంబ గద్వాల 18. కామారెడ్డి 07. కరీంనగర్ 91. ఖమ్మం 165. కొమరం భీం ఆసిఫాబాద్ 07. మహబూబ్ నగర్ 45.

మహబూబాబాద్ 68. మంచిర్యాల 65. మెదక్ 11. మేడ్చల్ మల్కాజ్ గిరి 95. ములుగు 37. నాగర్ కర్నూలు 26. నల్గొండ 151. నారాయణపేట 10. నిర్మల్ 11. నిజామాబాద్ 20. పెద్దపల్లి 88. రాజన్న సిరిసిల్ల 37. రంగారెడ్డి 107. సంగారెడ్డి 40. సిద్దిపేట 51. సూర్యాపేట 84. వికారాబాద్ 35. వనపర్తి 33. వరంగల్ రూరల్ 29. వరంగల్ అర్బన్ 61. యాదాద్రి భువనగిరి 46.  మొత్తం 1798.

Read More : Balakrishna Fans : యిన్నమూరి గోపీచంద్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా బాలయ్య పుట్టిన రోజు వేడుకలు..