Telangana Corona Cases : తెలంగాణలో కొత్తగా 348 కరోనా కేసులు

గడిచిన 24 గంటల్లో ఒక్క కరోనా మ‌ర‌ణం కూడా సంభ‌వించ‌లేదు. గడిచిన 24 గంటల వ్యవధిలో 38వేల 580 కరోనా పరీక్షలు చేయగా, 348 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

Telangana Corona Cases : తెలంగాణలో క‌రోనావైరస్ మహమ్మారి వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో ఒక్క కరోనా మ‌ర‌ణం కూడా సంభ‌వించ‌లేదు. గడిచిన 24 గంటల వ్యవధిలో 38వేల 580 కరోనా పరీక్షలు చేయగా, 348 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 93 కొత్త కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 429 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,87,785 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,79,279 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో 4వేల 396 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనాతో ఇప్ప‌టిదాకా మరణించిన వారి సంఖ్య 4,110గా ఉంది. క్రితం రోజుతో(374) పోలిస్తే కోవిడ్ కేసులు కాస్త తగ్గాయి.

Corona Virus: కరోనా ముగిసింది.. ఐటీ ఉద్యోగులకూ “వర్క్ ఫ్రమ్ హోమ్” అవసరం లేదు

అటు… దేశం వ్యాప్తంగానూ కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉంది. ముందురోజు 13 వేలకు తగ్గిన కొత్త కేసులు తాజాగా కాస్త పెరిగాయి. నిన్న 11 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 15వేల 102 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల వ్యవధిలో మరో 278 మంది కోవిడ్ తో చనిపోయారు. దేశంలో ఇప్పటివరకూ మొత్తం కేసులు 4.28 కోట్లకు చేరాయి. కోవిడ్ తో మరణించిన వారి సంఖ్య 5,12,622కి పెరిగింది.

Telangana : కరోనా వ్యాక్సినేషన్..దేశంలోనే తెలంగాణ టాప్

ఇక రెండు లక్షలకు దిగువకు చేరిన యాక్టివ్ కేసులు ప్రస్తుతం మరింత తగ్గాయి. ఆ కేసులు సంఖ్య 1.64 లక్షలకు పడిపోయింది. క్రియాశీల రేటు 0.38 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 98.42 శాతానికి పెరిగింది. కొవిడ్ వ్యాప్తి అదుపులో ఉండటంతో కొంతకాలంగా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉంటున్నాయి. నిన్న 31 వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం మీద 4.21 కోట్ల మంది వైరస్ నుంచి బయటపడ్డారు. ఇక నిన్న 33 లక్షల మంది టీకా వేయించుకున్నారు. 13 నెలల వ్యవధిలో 176 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. ఈ మేరకు కేంద్రం గణాంకాలు విడుదల చేసింది.

ట్రెండింగ్ వార్తలు