Corona Virus: కరోనా ముగిసింది.. ఐటీ ఉద్యోగులకూ “వర్క్ ఫ్రమ్ హోమ్” అవసరం లేదు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మూడో వేవ్ ముగిసిందని, ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా అవసరం లేదని అభిప్రాయపడ్డారు డీహెచ్ శ్రీనివాస్.

Corona Virus: కరోనా ముగిసింది.. ఐటీ ఉద్యోగులకూ “వర్క్ ఫ్రమ్ హోమ్” అవసరం లేదు

Corona (1)

Corona Virus: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మూడో వేవ్ ముగిసిందని, ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా అవసరం లేదని అభిప్రాయపడ్డారు డీహెచ్ శ్రీనివాస్. కరోనా మూడు వేవ్‌ల రూపంలో ప్రపంచాన్ని వణికించిందని, తెలంగాణలో కరోనా పాజిటివీటి రేటు ఇప్పుడు రెండు శాతంగానే ఉందని తెలిపారు.

తెలంగాణ ప్రజలంతా ఊపిరిపీల్చుకునే సమయం వచ్చేసిందని డీహెచ్ శ్రీనివాస్ వెల్లడించారు. ఫస్ట్ వేవ్ 10 నెలలు, సెకండ్ వేవ్ 6 నెలలు, థర్డ్ వేవ్ మూడు నెలలు మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు. తెలంగాణలో ఇక నుంచి ఎటువంటి ఆంక్షలు లేవని, కేంద్రం కూడా ఆంక్షలు ఎత్తివేసిందని డీహెచ్ చెప్పారు.

ఐటీ ఉద్యోగులు కూడా ఇకపై వర్క్ ఫ్రమ్ హోమ్ చెయ్యాల్సిన అవసరం లేదని అన్నారు. ఇక ముందు కూడా ఎన్ని వేరియంట్లు వచ్చినా ఎదుర్కోగలమనే ధీమా వ్యక్తం చేశారు శ్రీనివాస్. ఇప్పట్లో కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం కూడా లేదని ప్రజలు నిర్భయంగా ఉండొచ్చని అన్నారు.