Telangana Corona Cases Bulletin : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..

నేటివరకు రాష్ట్రంలో 7లక్షల 92వేల 842 కరోనా కేసులు నమోదవగా.. 7లక్షల 88వేల 324 మంది కోలుకున్నారు.(Telangana Corona Cases Bulletin)

Telangana Corona Cases Bulletin : తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 13వేల 054 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 40 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా హైదరాబాద్ లో 31 కరోనా కేసులు వచ్చాయి. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 46 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. కొత్తగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు.

North Korea: నార్త్‌ కొరియాలో కరోనా విలయం.. కషాయాలు, టీలు తాగండి అంటూ సలహా

రాష్ట్రంలో ఇంకా 407 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. నేటివరకు రాష్ట్రంలో 7లక్షల 92వేల 842 కరోనా కేసులు నమోదవగా.. 7లక్షల 88వేల 324 మంది కోలుకున్నారు. నేటివరకు రాష్ట్రంలో కొవిడ్ తో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

Monkeypox: మంకీపాక్స్ అంటే ఏమిటి? దానిని ఎలా గుర్తించాలి.. లక్షణాలేంటి..?

అటు దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులు స్వల్ప హెచ్చుతగ్గులతో 3 వేల దిగువనే నమోదవుతున్నాయి. మరోవైపు కొన్ని రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో యాక్టివ్ కేసులు క్రమంగా తగ్గుతూ 15 వేల దిగువకు చేరడం ఊరట కలిగిస్తోంది. ఇక మరణాలు కూడా గత కొన్ని రోజులుగా 30 లోపే నమోదవుతున్నాయి.

24గంటల వ్యవధిలో 4,99,382 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా నమోదైన కేసుల సంఖ్య 2,323. ఒక్కరోజు వ్యవధిలో మరో 25 మంది కొవిడ్ తో మరణించారు. నేటివరకు దేశంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 5,24,348. ఒక్కరోజు వ్యవధిలో మరో 2వేల 346 కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కొవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4.25 కోట్లు (98.75%). ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 14వేల 996 (0.03%). నిన్న పంపిణీ చేసిన టీకాల సంఖ్య 15,32,383 ( మొత్తం డోసుల సంఖ్య 192 కోట్లకుపైగా). ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

మరోవైపు కరోనా వ్యాప్తిని అదుపులోకి తెచ్చి.. కోట్లాది మంది ప్రాణాలను కాపాడుతున్న బృహత్తర టీకా పంపిణీ కార్యక్రమంలో భారత్‌ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉంది. 2021 జనవరి 16న వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రారంభించగా.. ఇప్పటి వరకు 192 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. త్వరలోనే 200 కోట్ల డోసుల మైలురాయిని చేరుకోనుంది.

కాగా, ప్రతి లబ్ధిదారునికి వ్యాక్సిన్‌ అందించేలా చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ముఖ్యంగా వచ్చే రెండు నెలలు (జూన్‌, జులై) ‘హర్ ఘర్ దస్తక్ 2.0’ పేరుతో ఇంటింటికీ వెళ్లి టీకా పంపిణీ చేసేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలని అన్ని రాష్ట్రాల వైద్యాధికారులకు స్పష్టం చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా వృద్ధాశ్రమాలు, స్కూళ్లు, కాలేజీలు, ఖైదీలు, ఇటుక బట్టీల వంటి ప్రాంతాల్లో పనిచేసేవారు, విద్యకు దూరమైన చిన్నారులకు వ్యాక్సిన్‌ అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని తెలిపింది. ముఖ్యంగా 12 నుంచి 14ఏళ్ల పిల్లలకు టీకా పంపిణీ తక్కువగా ఉండడం, మరోవైపు ఆ వయసువారికి కొవిడ్‌ ముప్పు అధికంగా ఉన్నందున వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

ట్రెండింగ్ వార్తలు