Covid cases : తెలంగాణలో కొత్తగా 5,093 పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో నిన్న కొత్తగా 5వేల 93 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3లక్షల 51 వేల 424 కు చేరింది.

Telangana reports 5,093 New Covid cases : తెలంగాణ రాష్ట్రంలో నిన్న కొత్తగా 5వేల 93 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3లక్షల 51 వేల 424 కు చేరింది. రాష్ట్రంలో కరోనా కేసులు నమోదైన తర్వాత ఇవే అత్యధిక కేసులు. కోవిడ్ కేసులు పెరుగుతున్నదృష్ట్యా ప్రభుత్వం కరోనా పరీక్షలను ఎక్కువ సంఖ్యలో చేస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం శనివారం 1,29,637 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించింది. కరోనా వైరస్ బారిన పడి నిన్న 15 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,824కి చేరింది. కరోనా నుంచి కోలుకుని 1,555 మంది బాధితులు నిన్న డిశ్చార్జ్ అయి ఇళ్ళకు తిరిగి వెళ్లారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3లక్షల 12 వేల 563 కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 37,037 యాక్టివ్ కేసులు ఉండగా వీరిలో 24, 156 మంది హోం ఐసోలేషన్ లో ఉన్నారు. ఇక కొత్త‌గా న‌మోదైన పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ ప‌రిధిలో 743 కేసులు ఉండ‌గా, మేడ్చ‌ల్ జిల్లాలో 488, రంగారెడ్డి 407, నిజామాబాద్‌లో 367 చొప్పున ఉన్నాయి.

ఈ  లెక్కలు చూస్తుంటే గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో కరోనా విజృంభణ అధికంగా ఉంది. మరోవైపు డిమాండ్‌కు తగినట్టు వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో ఇవాళ వ్యాక్సినేషన్‌కు తెలంగాణలో బ్రేక్ పడింది… సాయంత్రం లోగా కేంద్రం నుంచి కొత్త డోసులు వస్తేనే రేపటి నుంచి టీకా కార్యక్రమంగా మళ్లీ ప్రారంభమవుతుంది

Covid Report

 

Dist Wise Report Ts

ట్రెండింగ్ వార్తలు