Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులు అంటే

తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది.

Telangana Covid Cases : తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది.

Monkeypox: పెరుగుతున్న మంకీపాక్స్ కేసులు.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 33వేల 017 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 652 మందికి పాజిటివ్ గా తేలింది. అత్యధికంగా హైదరాబాద్ లో 297 కొత్త కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 57, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 51 కేసులు, కరీంనగర్ జిల్లాలో 28 కేసులు, మహబూబాబాద్ జిల్లాలో 19 కేసులు, ఖమ్మం జిల్లాలో 18 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 627 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఊరటనిచ్చే అంశం ఏంటంటే.. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

రాష్ట్రంలో నేటివరకు 8,13,772 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 04వేల 950 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4వేల 711కి చేరింది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 32వేల 800 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 739 మందికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.

India’s population: 41 కోట్లు తగ్గనున్న భారత జనాభా

కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రజలకు జాగ్రత్తలు చెప్పింది. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించింది. చేతులను తరుచుగా శుభ్రంగా కడుక్కోవాలంది. అనవసర ప్రయాణాలు చేయొద్దని సూచించింది. పెద్దలు, పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు